Kidney Problems : ఈ 5 ఆహారపు అలవాట్లతో కిడ్నీ సమస్యకు చెక్ పెట్టవచ్చు.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kidney Problems : ఈ 5 ఆహారపు అలవాట్లతో కిడ్నీ సమస్యకు చెక్ పెట్టవచ్చు..

 Authored By prabhas | The Telugu News | Updated on :14 March 2023,7:00 am

Kidney Problems : ప్రస్తుతం మనం జీవిస్తున్న జీవనశైలి లో కొన్ని ఆహారపు అలవాట్లు మారడంతో ఎన్నో రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరీర అవయవాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అలాంటి అవయవాలలో కిడ్నీలు కూడా ఉంటాయి. శరీరంలోని ప్రధానమైన అవయవ భాగాలలో మూత్రపిండాలు కూడా ముఖ్యమైనవి. మూత్రపిండాలు పనితీరులో చిన్న మార్పులు కూడా ప్రమాదకర వ్యాధులకు కారణమవుతాయి. మూత్ర పిండాలు మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్ధపదార్థాలను బయటికి పంపించడానికి సహాయపడతాయి. ఇది మంచి ఆరోగ్యం కోసం మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కావున కిడ్నీలు మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపకుండా చేస్తుంటాయి. అయితే మూత్రపిండాలలో ఏదైనా సమస్య వస్తే వెంటనే కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

Kidney problems can be checked with these 5 food habits

Kidney problems can be checked with these 5 food habits

లేకపోతే పెను ప్రమాదం ఎదురవుతుంది అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. *నీరస పడిపోవడం: చాలామంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూర్చోని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. మూత్రపిండాల సమస్య ఉన్నప్పుడు శరీరం చురుగ్గా ఉండటం చాలా ప్రధానమని నిపుణులు తెలుపుతున్నారు. ఈ మూత్రపిండాల సమస్య ఉంటే మీరు తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయాలని దీని వలన శరీరం చురుకుగా తయారవుతుందని చెప్తున్నారు. *నీరు తక్కువగా తీసుకోవడం: మూత్రపిండాలు శుభ్రం అవ్వాలంటే నీటిని పుష్కలంగా తాగడం చాలా ప్రధానం. నీరు అధికంగా తీసుకోవడం వలన కిడ్నీలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోవు.. తక్కువ నీళ్లు తీసుకోవడం వల్ల కిడ్నీలలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి కిడ్నీలు దెబ్బతింటాయి. *పొటాషియం: కిడ్నీ వ్యాధిగ్రస్తులు పొటాషియం అధికంగా ఉండే వాటిని తీసుకోకూడదు.

Know the Signs and Stages of Kidney Disease

మూత్రపిండా సమస్యలు ఉంటే బంగాళదుంపలు, బత్తాయి లాంటి వాటిని కూడా తినవద్దు. అవకాడో, అరటి పండ్లు తినడం కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి మంచిది కాదు. ఎందుకంటే వీటిలో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కిడ్నీలు దెబ్బతినేలా చేస్తాయి. *ఉప్పు ఎక్కువ తీసుకోవడం:
ఉప్పు ఆహారం రుచిని పెంచుతుంది. ఈ ఉప్పు లో సోడియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపుతుంది. దాని వలన మీకు కిడ్నీ సంబంధిత సమస్య ఉంటే ఉప్పు అధికంగా వాడడం మానుకోవాలి. ఉప్పు తీసుకోవడం వలన గుండెపోటు రక్తపోటు లాంటి సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. *నిద్ర: ఆరోగ్యంగా ఉండడానికి సరియైన నిద్ర చాలా ముఖ్యం. కానీ కిడ్నీ రోగులు పగటివేల ఎక్కువసేపు నిద్రపోవడం అసలు మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువసేపు నిద్రపోవడం వలన మూత్రపిండాల్లోకి మూత్రం ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల కిడ్నీలు పాడవుతాయి. అందుకే సాధ్యమైనంత వరకు రాత్రివేళలోనే నిద్రించాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది