Oranges Side effects: నారింజ పండ్లు ఈ సమస్యలతో ఉన్నవారు అసలు తినకూడదు.. తిన్నారో టెంజర్‌లో పడట్లే..!
ప్రధానాంశాలు:
Oranges Side effects: నారింజ పండ్లు ఈ సమస్యలతో ఉన్నవారు అసలు తినకూడదు.. తిన్నారో టెంజర్‌లో పడట్లే..!
Oranges Side effects: ప్రకృతి మనకు అందించిన అత్యంత పోషక విలువలున్న పండ్లలో నారింజ ఒకటి. విటమిన్-సి కి ప్రతీకగా చెప్పుకునే ఈ పండు రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు… చర్మ సౌందర్యం, గుండె ఆరోగ్యం, జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు మార్కెట్లన్నీ నారింజలతో నిండిపోతాయి. అయితే “నారింజ అందరికీ మంచిదే” అనుకోవడం మాత్రం పొరపాటు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నారింజను తీసుకుంటే మేలు కంటే నష్టం ఎక్కువయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Oranges Side effects: నారింజ పండ్లు ఈ సమస్యలతో ఉన్నవారు అసలు తినకూడదు.. తిన్నారో టెంజర్‌లో పడట్లే..!
Oranges Side effects: కిడ్నీ.. గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్త
నారింజలో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఆరోగ్యవంతులకు ఇది లాభమే అయినా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరంగా మారుతుంది. కిడ్నీలు సరిగా పనిచేయని సమయంలో శరీరంలోని అదనపు పొటాషియం బయటకు వెళ్లదు. ఫలితంగా రక్తంలో పొటాషియం స్థాయి పెరిగి హైపర్‌కలేమియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది గుండె స్పందనలో అవకతవకలు కండరాల బలహీనత, తీవ్రమైతే గుండెపోటు ప్రమాదం వరకూ తీసుకెళ్లొచ్చు. అందుకే కిడ్నీ లేదా గుండె సమస్యలు ఉన్నవారు నారింజ తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
Oranges Side effects: యాసిడిటీ, GERD ఉన్నవారికి నారింజ ఎందుకు కష్టం?
నారింజలో సహజంగానే సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, యాసిడ్ రిఫ్లక్స్ లేదా GERD తో బాధపడేవారిలో ఇది సమస్యను మరింత పెంచుతుంది. నారింజ తిన్న వెంటనే గుండెల్లో మంట, ఛాతీలో ఒత్తిడి, గొంతులో మంట వంటి లక్షణాలు కనిపించవచ్చు. ప్రత్యేకంగా భోజనం తర్వాత నారింజ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేస్తుంది. తరచూ గుండెల్లో మంట వచ్చే వారు అన్నవాహికకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు నారింజకు కొంత దూరంగా ఉండటం మంచిది.
Oranges Side effects: జీర్ణ సమస్యలు.. అలెర్జీలు ఉన్నవారు దూరంగా ఉండాలా?
నారింజలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. కానీ తగినంత నీరు తాగకుండా నారింజను ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం తగ్గే బదులు పెరిగే అవకాశం ఉంది. శరీరంలో తేమ సరిపోకపోతే ఫైబర్ మలాన్ని గట్టిగా చేసి విసర్జనను కష్టతరం చేస్తుంది. ఇక కొందరికి నారింజలోని ప్రత్యేక ప్రోటీన్ల వల్ల సిట్రస్ అలెర్జీ ఉంటుంది. నోటి చుట్టూ దురద, చర్మంపై దద్దుర్లు, పెదవులు లేదా గొంతు వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నారింజ తినడం ఆపాలి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. నారింజ పోషకాహారంతో నిండిన అద్భుతమైన పండు అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ సరిపోతుందన్న గ్యారంటీ లేదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి శరీర అవసరాలను గుర్తించి మాత్రమే నారింజను ఆహారంలో భాగం చేసుకోవడం తెలివైన నిర్ణయం.