Health Benefits : ఒకప్పుడు మన ఇంట్లో ఉండే పెరటి తోటలో కచ్చితంగా ఉండే చెట్టు నిమ్మచెట్టు. జాము, మామి చెట్లతో పాటు దీన్ని కూడా ప్రతీ ఒక్కరూ పెంచేవారు. ప్రస్తుతం కాలంలో పెరడుకు ఎక్కువ స్థలం లేకపోవడంతో ఈ చెట్లను ఎక్కువగా పెంచట్లేదు. కానీ నిమ్మ చెట్టు వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం.. ఉన్న కాసంత స్థలంలోనా లేదా టెర్రస్ పైనో ఈ మొక్కలను కచ్చితంగా పెంచేస్తారు. ఎందుకంటే నిగనిగలాడుతూ కనిపించే ఆ ఆకులు.. చిన్న చిన్న తెల్లని పూలు ఏడాదంతా ఇచ్చే కాయల కోసం వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. అయితే నిమ్మ చెట్ల వల్ల ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ఫలితాలు కూడా ఉన్నాయి. నిమ్మ కాయల్లో విటామిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియంలు అధికంగా ఉంటాయి. అయితే వీటి వల్ల మానవ శరీరంలోని ఎముకలు గట్టిపడతాయి.
అలాగే గుండె సంబంధిత రోగాలు, క్యాన్సర్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో నిమ్మ కాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.అంతే కాదండోయ్ నిమ్మకాయ వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా పలు రకాల సమస్యలను కూడా తొలగిస్తాయి. అందుకే నిమ్మ కాయలను ఎక్కువగా వంటల్లో వాడుతుంటారు. అంతే కాకుండా చాలా కీటకాలు సిట్రస్ మొక్క అయిన నిమ్మ చెట్టును అస్సలే పాడు చేయలేవు. ఈ చెట్టు కోసం మీరు ప్రత్యేక రక్షణ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నిమ్మ చెట్టు పరిమళ భరితమైన సువాసనలను వెదజల్లుతుంది. అలాగే నిమ్మ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మ కాయలే కాకుండా ఆకుల వాసన చూడటం
వల్ల కూడా వాంతులు, వికారం వంటి సమస్యలను తొలగించుకోవచ్చట.అలాగే నిద్రలేమి, డిప్రెషన్ వంటి వాటికి కూడా చెక్ పెట్టొచ్చు. ఒక గ్లాసు నీటిలో ఐదారు నిమ్మ ఆకులను వేసి మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల శ్వాస కోశ, దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి రోగాలను తగ్గించుకోవచ్చు. కండరాల నొప్పులు, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, జీర్ణ సంబంధ వ్యాధులకు నిమ్మ కాయలు చాలా బాగా పని చేస్తాయి. సిట్రస్ ఆసిడ్లు ఎక్కువగా ఉండే నిమ్మకాయ కడుపులోని క్రిములను నిర్మూలిస్తుంది. అంతే కాకుండా నులి పురుగులు ఉన్నప్పుడు ఒఖ స్పూన్ నిమ్మ ఆకుల రసంలో తేనె కలిపి ఐదు నుంచి పది రోజుల పాటు తాగడం వల్ల సమస్య తీరిపోతుందట. అలాగే ఎక్కువ బరువు ఉన్నవారు సన్నబడాలంటే కూడా ఈ రసం తాగితే మంచిదట.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.