Health Benefits : నిమ్మ ఆకుల గురించి మీకీ విషయాలు తెలిస్తే.. ఇంట్లోనే నిమ్మతోట పెంచేస్తారు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benefits : నిమ్మ ఆకుల గురించి మీకీ విషయాలు తెలిస్తే.. ఇంట్లోనే నిమ్మతోట పెంచేస్తారు!

Health Benefits : ఒకప్పుడు మన ఇంట్లో ఉండే పెరటి తోటలో కచ్చితంగా ఉండే చెట్టు నిమ్మచెట్టు. జాము, మామి చెట్లతో పాటు దీన్ని కూడా ప్రతీ ఒక్కరూ పెంచేవారు. ప్రస్తుతం కాలంలో పెరడుకు ఎక్కువ స్థలం లేకపోవడంతో ఈ చెట్లను ఎక్కువగా పెంచట్లేదు. కానీ నిమ్మ చెట్టు వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం.. ఉన్న కాసంత స్థలంలోనా  లేదా  టెర్రస్ పైనో ఈ మొక్కలను కచ్చితంగా పెంచేస్తారు. ఎందుకంటే నిగనిగలాడుతూ కనిపించే ఆ ఆకులు.. […]

 Authored By pavan | The Telugu News | Updated on :7 March 2022,3:30 pm

Health Benefits : ఒకప్పుడు మన ఇంట్లో ఉండే పెరటి తోటలో కచ్చితంగా ఉండే చెట్టు నిమ్మచెట్టు. జాము, మామి చెట్లతో పాటు దీన్ని కూడా ప్రతీ ఒక్కరూ పెంచేవారు. ప్రస్తుతం కాలంలో పెరడుకు ఎక్కువ స్థలం లేకపోవడంతో ఈ చెట్లను ఎక్కువగా పెంచట్లేదు. కానీ నిమ్మ చెట్టు వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం.. ఉన్న కాసంత స్థలంలోనా  లేదా  టెర్రస్ పైనో ఈ మొక్కలను కచ్చితంగా పెంచేస్తారు. ఎందుకంటే నిగనిగలాడుతూ కనిపించే ఆ ఆకులు.. చిన్న చిన్న  తెల్లని పూలు ఏడాదంతా ఇచ్చే కాయల కోసం వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. అయితే నిమ్మ చెట్ల వల్ల ఆహ్లాదకర వాతావరణం ఏర్పడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ఫలితాలు కూడా ఉన్నాయి. నిమ్మ కాయల్లో విటామిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియంలు అధికంగా ఉంటాయి. అయితే వీటి వల్ల మానవ శరీరంలోని ఎముకలు గట్టిపడతాయి.

అలాగే గుండె సంబంధిత రోగాలు, క్యాన్సర్, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో నిమ్మ కాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది.అంతే కాదండోయ్ నిమ్మకాయ వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా పలు రకాల సమస్యలను కూడా తొలగిస్తాయి. అందుకే నిమ్మ కాయలను ఎక్కువగా వంటల్లో వాడుతుంటారు. అంతే కాకుండా చాలా కీటకాలు సిట్రస్ మొక్క అయిన నిమ్మ చెట్టును అస్సలే పాడు చేయలేవు. ఈ చెట్టు కోసం మీరు ప్రత్యేక రక్షణ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే నిమ్మ చెట్టు పరిమళ భరితమైన సువాసనలను వెదజల్లుతుంది. అలాగే నిమ్మ ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మ కాయలే కాకుండా ఆకుల వాసన చూడటం

Lemon Leaves in health benefits

Lemon Leaves in health benefits

వల్ల కూడా వాంతులు, వికారం వంటి సమస్యలను తొలగించుకోవచ్చట.అలాగే నిద్రలేమి, డిప్రెషన్ వంటి వాటికి కూడా చెక్ పెట్టొచ్చు.  ఒక గ్లాసు నీటిలో ఐదారు నిమ్మ ఆకులను వేసి మరిగించి.. ఆ నీటిని తాగడం వల్ల శ్వాస కోశ, దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ వంటి రోగాలను తగ్గించుకోవచ్చు. కండరాల నొప్పులు, కడుపు నొప్పి, జాయింట్ పెయిన్స్, జీర్ణ సంబంధ వ్యాధులకు నిమ్మ కాయలు చాలా బాగా పని చేస్తాయి. సిట్రస్ ఆసిడ్లు ఎక్కువగా ఉండే నిమ్మకాయ కడుపులోని క్రిములను నిర్మూలిస్తుంది. అంతే కాకుండా నులి పురుగులు ఉన్నప్పుడు ఒఖ స్పూన్ నిమ్మ ఆకుల రసంలో తేనె కలిపి ఐదు నుంచి పది రోజుల పాటు తాగడం వల్ల సమస్య తీరిపోతుందట. అలాగే ఎక్కువ బరువు ఉన్నవారు సన్నబడాలంటే కూడా  ఈ రసం తాగితే మంచిదట.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది