Mango : ఈ పండు రసం, కాయ, ఆకు ఏది తీసుకున్నా ఎన్నో లాభాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mango : ఈ పండు రసం, కాయ, ఆకు ఏది తీసుకున్నా ఎన్నో లాభాలు

 Authored By prabhas | The Telugu News | Updated on :22 May 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Mango : ఈ పండు రసం, కాయ, ఆకు ఏది తీసుకున్నా ఎన్నో లాభాలు

Mango : పండ్ల‌లో రాజు మామిడి. అటువంటి మామిడిని ముక్కలుగా కట్ చేసి మిక్సీలో మెత్తగా చేసి పాలతో కలిపి తాగితే శరీరానికి త‌క్ష‌ణ శక్తి అందుతుంది. గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగుపరుస్తుంది. ప్రోటీన్లకు కేంద్రమైన పాల‌ను, విటమిన్లకు నిలయమైన మామిడిని కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఈ రెండింటి కలయిక మంచి ఆరోగ్య లాభాల‌ను అందిస్తుంది.

Mango ఈ పండు రసం కాయ ఆకు ఏది తీసుకున్నా ఎన్నో లాభాలు

Mango : ఈ పండు రసం, కాయ, ఆకు ఏది తీసుకున్నా ఎన్నో లాభాలు

– తాజా మామిడి గుజ్జుతో చేసిన రసం తాగడం ద్వారా శరీరానికి కావాల్సిన కాల్షియం, విటమిన్ D బాగా అందుతాయి. ఈ పోషకాలు ఎముకల బలానికి చాలా అవసరం. వారానికి ఒకసారైనా మామిడి జ్యూస్ తాగితే శరీరానికి శక్తి, ఉత్సాహం వస్తుంది.

– అన్ని పండ్లను భోజనంతో కలిపి తినకూడదని చాలా మంది అంటారు. కానీ మామిడిని మాత్రం భోజన సమయంలో తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది అజీర్తిని దూరం చేస్తుంది. అయితే మామిడి పూర్తిగా పండినదే తీసుకోవాలి. పచ్చి మామిడి అయితే జీర్ణవ్యవస్థపై ఒత్తిడి కలిగించవచ్చు.

– మామిడి ఆకులను శుభ్రంగా కడిగి వాటిని బాగా నూరి ఆ మిశ్రమాన్ని మీగడలో కలిపి మొహానికి రాసుకుంటే చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చలు, నల్లని మచ్చలు తగ్గిపోతాయి. ఇది సహజమైన ఫేస్ మాస్క్‌లా పని చేస్తుంది. వారానికి మూడు సార్లు ఇలా చేస్తే మొహం మెరిసిపోతుంది.

– పండిన మామిడిని పాలలో కలిపి తీసుకోవడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వేసవిలో ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హాని నుంచి కాపాడతాయి. అలాగే బీటా కెరోటిన్ చర్మ కణాలను కాపాడడానికి చాలా ఉపయోగ పడుతుంది.

మామిడి తినడం వల్ల శరీరానికి శక్తి, చర్మానికి మెరుపు, మనసుకు ఉల్లాసం అన్నీ ఒకేసారి లభిస్తాయి. సరిగ్గా, సరైన టైమ్‌లో, తగినంత మోతాదులో తీసుకుంటే ఇది ఆరోగ్యానికి వరంగా మారుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది