Monsoon Health Tips : వర్షాకాలంలో హెర్బల్ టీ తాగండి… ఈ వ్యాధులన్నీ ఫటాఫట్… ధనాధన్…?
ప్రధానాంశాలు:
Monsoon Health Tips : వర్షాకాలంలో హెర్బల్ టీ తాగండి... ఈ వ్యాధులన్నీ ఫటాఫట్... ధనాధన్...?
Monsoon Health Tips : సాధారణంగా ఎంత ఎండలు ఉన్నా, ఇంకా ఎంత చలిగా ఉన్నా మనం బయటికి వెళ్లి తిరగగలం. కానీ ఒక్క వర్షాకాలంలో మాత్రం అలా బయట తిరగలేం. బయట అడుగు పెట్టాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఎక్కడ చూసినా బురద, మట్టి, తడి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనికి తోడు అనేక రోగాలు కూడా వేధిస్తుంటాయి.అంటు వ్యాధులు ప్రబలే సమయం కూడా వర్షాకాలమే. ఇలాంటి వర్షాకాలంలో శరీరంలో ఇమ్యూనిటీని కూడా కోల్పోతుంది. ఇంకా శరీరం వెచ్చదనాన్ని కూడా కోల్పోతుంది. చల్లటి వాతావరణంలో వేడివేడి టీ ని తాగాలనిపిస్తుంది. అయితే, ఎన్నో రకాల టీలు, కాఫీలు తాగుతూ ఉంటాం. ఇంకా గ్రీన్ టీం కూడా తాగుతూ ఉంటారు. ఈ వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుకొనుటకు హెర్బల్ టీ ని ఒకసారి తాగి చూడండి అంటున్నారు నిపుణులు.ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు. ఈ హెర్బల్ టీ ని ఎలా తయారు చేయాలి,దీని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుదాం. అన్ని సీజన్ల కన్నా వర్షాకాలంలోనే అంటూ వ్యాధులు ఎక్కువగా సోకుతాయి. చల్లని గాలి, తడి బట్టలు, వాతావరణంలో తేమ, మన రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. వాతావరణంలో జలుబు, దగ్గు, కడుపు ఇన్ఫెక్షన్లు వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలామందికి చర్మ దద్దుర్లు దురద పొంగల్ ఇన్ఫెక్షన్స్ కాలేయ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి,ఇలాంటి పరిస్థితుల్లో మీ కుటుంబంలో పిల్లలు,పెద్దలు ఈ వ్యాధుల నుండి రక్షించబడాలంటే మీ ఆహారంలో ఆయుర్వేదాన్ని చేర్చుకోవాలి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కింద వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించుకొనుటకు హెర్బల్ టీ శరీరానికి డిటాక్స్ గా పని చేస్తుంది. కాబట్టి వర్షాకాలంలో ఒక్కసారి హెర్బల్ టీ ని ట్రై చేసి చూడండి.

Monsoon Health Tips : వర్షాకాలంలో హెర్బల్ టీ తాగండి… ఈ వ్యాధులన్నీ ఫటాఫట్… ధనాధన్…?
Monsoon Health Tips హెర్బల్ టీ కి కావలసిన ఎనిమిది పదార్థాలు
తులసి ఆకులు : ఇవి రోగ నిరోధక శక్తికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
అల్లం : జలుబు, జీర్ణక్రియ సమస్యలకు ఇది బాగా సహకరిస్తుంది.
దాల్చిన చెక్క : కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇంకా రక్తంలో చక్కెర నియంత్రణ చేయగలదు.
పిప్పలి : జీర్ణ క్రియకు, దగ్గుకు పిప్పలు ఒక దివ్య ఔషధం.
యాలకులు : రుచి, సువాసనతో పాటు జీర్ణ క్రియ కుడా ఎంతో మేలు చేస్తుంది.
లవంగాలు : ఇవి యాంటీ బ్యాక్టీరియల్ శక్తికి మూలం.
పసుపు పొడి : శరీర నిర్వీకరణ, శోధ నిరోధక శక్తి.
నీరు : నీరు జీవితానికి ఎంతో ఆధారం.
నిమ్మరసం : విటమిన్ సి సమృద్ధిగా కలిగి ఉంటుంది.ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది.
తయారీ విధానం :
ఈ పదార్థాలన్నీటిని నాలుగు కప్పుల నీటిలో వేసి తక్కువ మంట మీద మరిగించాలి.ఈ మిశ్రమం రెండు కప్పులకు వచ్చినప్పుడు దాన్ని వడపోసుకోవాలి.తరువాత దానికి కొన్ని చుక్కల నిమ్మ రసాన్ని జోడించాలి ప్రతి సిప్ తో మీ ఆరోగ్యాన్ని బలపరుస్తుంది.
ఈ హెర్బల్ టీ ప్రయోజనాలు : బలమైన రోగనిరోధక శక్తి :
వర్షాకాలంలో వైరల్ ఫీవర్, జలుబు ఇంకా ప్రమాదకరమైన వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ హెర్బల్టి ప్రతిరోజు తీసుకుంటే మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకా, అనారోగ్య సమస్యలకు గురికాకుండా కాపాడుతుంది.
బరువు తగ్గడంలో :
మీరు అధిక బరువుతో బాధపడుతూ ఉంటే,ఒకసారి హెర్బల్టీని ట్రై చేసి చూడండి. ఇందులో, దాల్చిన చెక్క, పసుపు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఎక్కువసేపు ఆకలి కానివ్వకుండా కడుపు నిండిన ఫీలింగ్ కలిగిస్తుంది. దీంతో బరువు తగ్గవచ్చు.
జీర్ణ క్రియ మెరుగ్గా:
అల్లం, పిప్పలి ఉండడం వల్ల ఈ జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షంలో కడుపునొప్పి, విరేచనాలు ఇంకా గ్యాస్ వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి సమయంలో ఈ హెర్బల్ టీ ని తీసుకున్నట్లయితే, జీవక్రియ సక్రియంగా ఉంటుంది.కడుపు తేలికగా అనిపిస్తుంది.
శరీరం డీ టాక్సి పై :
ఎక్కువగా వేయించిన ఆహారం తినడం,బయటి నీరు త్రాగడం, చెడు అలవాట్ల కారణంగా శరీరంలో విష పదార్ధాలు పేరుకపోవడం, ఈ మూలిక టీ ఆ విష పదార్థాలను తొలగిస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం అంటే సమస్యలను కూడా తొలగించి వేస్తుంది.