Mosquito Coils : మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగ మన ఆరోగ్యాన్ని ఎంతలా పాడు చేస్తాయో తెలుసా…!!
Mosquito Coils : వర్షాకాలం వచ్చింది అంటే చాలు దోమల తో ఎంతో ఇబ్బంది పడతాము. అయితే మన ఇంట్లో ఉండే దోమలను నివారించేందుకు చాలామంది మస్కిటో కాయిల్ ను వాడుతూ ఉంటాము. ఈ మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ దోమలను తరిమి కొడుతుంది. అయితే ఈ మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ అనేది మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పొగను పీల్చడం అంటే మీరు సిగరెట్టు […]
ప్రధానాంశాలు:
Mosquito Coils : మస్కిటో కాయిల్స్ నుండి వచ్చే పొగ మన ఆరోగ్యాన్ని ఎంతలా పాడు చేస్తాయో తెలుసా...!!
Mosquito Coils : వర్షాకాలం వచ్చింది అంటే చాలు దోమల తో ఎంతో ఇబ్బంది పడతాము. అయితే మన ఇంట్లో ఉండే దోమలను నివారించేందుకు చాలామంది మస్కిటో కాయిల్ ను వాడుతూ ఉంటాము. ఈ మస్కిటో కాయిల్ నుంచి వచ్చే పొగ దోమలను తరిమి కొడుతుంది. అయితే ఈ మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ అనేది మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పొగను పీల్చడం అంటే మీరు సిగరెట్టు తాగినట్లే. ఎందుకు అంటే ఈ కాయిల్ లో ఎన్నో రకాల రసాయనాలను కలుపుతారు. అయితే ఈ పొగ అనేది డైరెక్ట్ గా ఊపిరితిత్తుల్లోకి చేరి మన శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. ఈ మస్కిటో కాయిల్ నుండి వచ్చే పోగ ను పీల్చడం వలన ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఈ మస్కిటో కాయిల్స్ లోని సమ్మేళనాలు తలనొప్పికి కూడా దారి తీస్తుంది. అందుకే చాలా మందికి దోమల నివారణ మందు వాసన చూసినప్పుడు వెంటనే తలనొప్పి అనేది వస్తుంది. అలాగే ఇది శ్వాసకు సంబంధించిన సమస్యలను కూడా కలిగిస్తుంది…
మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ కారణం చేత ఆస్తమ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ పొగ అనేది ఎంతో విషపూరితమైనది అని ఇది మెదడును కూడా దెబ్బతీస్తుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే దీనివలన స్కిన్ అలర్జీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే దీని నుండి వెలుపడే పొగ కారణం చేత పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మస్కిటో కాయిల్ నుండి వచ్చే పొగ వలన చాలా మందికి చర్మం పై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే అలర్జీ సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ మస్కిటో కాయిల్ కు దూరంగా ఉంటేనే మంచిది. అలాగే ఈ మస్కిటో కాయిల్ అనేది పర్యావరణం పై కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీని నుండి వచ్చే విషపూరితపైన పోగ గాలిని కూడా కలుషితం చేస్తుంది…
దోమలను తగ్గించడానికి వాడే మస్కిటో కాయిల్స్ లో క్యాన్సర్ కారకాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కూడా కారణం అవుతుంది. అలాగే మీ ఇంట్లో పిల్లలు ఉంటే వీలైనంతవరకు మస్కిటో కాయిల్స్ ను వాడటం మానేయండి. ఈ దోమలను తగ్గించుకోవటానికి సహజ మార్గాలను ఎంచుకోండి. దీనికి బదులుగా దోమ తెరలను వాడండి. మీరు దోమ తెరలను మీ బెడ్ చుట్టు కట్టుకుంటే దోమలనేవి రావు. అలాగే దోమలను సహజంగా తగ్గించడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఫాలో అవ్వండి…