Neem Water : వేప నీరుని ఖాళీ కడుపుతో తాగారంటే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మీకు తెలుసా…?
ప్రధానాంశాలు:
వేప నీరుని ఖాళీ కడుపుతో తాగారంటే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మీకు తెలుసా ...?
Neem Water : ప్రస్తుతం ప్రజలలో అనారోగ్య సమస్యలు Health నానాటికీ పెరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే ఉదయాన్నే పరగడుపున కొన్ని ఔషధాలను తీసుకుంటే మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అయితే ఉదయాన్నే పరగడుపున వేప ఆకుల నీటిని తీసుకుంటే, మనకి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకనగా, ఈ వేప ఆకులలో వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఆయుర్వేదంలో ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. వేప ఆకులు అంటే, లేత వేప ఆకులని తీసుకోవాలి. దీనిలో ఔషధ గుణాలు నిండి ఉన్నాయి. ఈ లేత వేప ఆకులతో క్యాన్సర్ కణాలను నాశనం చేయగలిగే శక్తిని కలిగి ఉంది. ఇది ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు, వేప గింజలలో ఒక క్రియాశీల సమ్మేళనం ఉంటుంది. ఇది జుట్టు, చర్మానికి హాని కలిగించే పరానా జీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది.

Neem Water : వేప నీరుని ఖాళీ కడుపుతో తాగారంటే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, మీకు తెలుసా…?
వేపా ఒక ఔషధమూలిక. ఆయుర్వేదంలో ఉపయోగించే ప్రసిద్ధ పదార్థాలలో వేప కూడా ఒకటి. ఆయుర్వేదంలో వేప చెట్టులోని ఆకులు, పండ్లు, నూనె, వేర్లు, బెరడు, వేపరసం వంటి ప్రతి బాగానే ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఈ చెట్టు మొత్తం కూడా ఔషధాలుగని. ఆయుర్వేదంలో ఈ వేప చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉదయాన్నే లేవగానే పరిగడుపున ఈ తాజా వేపరసాన్ని తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. లేత ఆకు వేపరసాన్ని తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
ఉదయం ఖాళీ కడుపుతో వేప ఆకుల నీటిని తీసుకోవడం వల్ల, బ్యాక్టీరియా వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లేత వేపాకులను నీటిలో నాన్న పెట్టాలి , ఆ తర్వాత వచ్చిన నీటిని ఔషధంగా వినియోగిస్తారు. ఇది ఔషధ గుణాలతో నిండి ఉంది. క్యాన్సర్ కారకాలను నాశనం చేయగలదు. వేప గింజలలో ఒక క్రియాశీల సమ్మేళనం దాగి ఉంది. ఇది చర్మానికి, జుట్టుకు హాని కలిగించే పరాన్నాజీవులకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వేప ఆకు పదార్థాలు లేదా రసం గాయాలను నయం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. దీనికోసం ఒక పది తాజా లేత వేప ఆకులను తీసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. వాటిని కావాల్సినన్ని నీటిలో వేసి, ఐదు నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టుకుంటే వేపనీరు సిద్ధమవుతుంది. వేప చెట్టు యొక్క ప్రతి ఒక్క భాగం కూడా మనకు ఎన్నో ఆరోగ్య సమస్యలను నయం చేయుటకు ఉపకరిస్తుంది.