Nerve Weaknes : నరాల బలహీనత ఉన్నవాళ్లు ఒక్కసారి ఇది తిన్నారంటే బలంగా తయారవుతారు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nerve Weaknes : నరాల బలహీనత ఉన్నవాళ్లు ఒక్కసారి ఇది తిన్నారంటే బలంగా తయారవుతారు ..!

Nerve Weaknes : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది ఏది పడితే అది తింటున్నారు. కడుపునిండా తింటున్నారు కాని శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు దీంతో వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒక సమస్య నరాల బలహీనత. మనం తినే ఫుడ్ ఆరోగ్యవంతమైనది అయితే మనకి ఎటువంటి రోగాలు రావు. నరాల బలహీనత ఉన్నవారు ఏ పనిని సరిగ్గా చేయలేరు కాసేపటికే అలసిపోతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు ఈ ఆహారాన్ని కనుక […]

 Authored By aruna | The Telugu News | Updated on :18 June 2023,8:00 am

Nerve Weaknes : ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా చాలామంది ఏది పడితే అది తింటున్నారు. కడుపునిండా తింటున్నారు కాని శరీరానికి అవసరమైన పోషకాలు అందడం లేదు దీంతో వివిధ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో ఒక సమస్య నరాల బలహీనత. మనం తినే ఫుడ్ ఆరోగ్యవంతమైనది అయితే మనకి ఎటువంటి రోగాలు రావు. నరాల బలహీనత ఉన్నవారు ఏ పనిని సరిగ్గా చేయలేరు కాసేపటికే అలసిపోతూ ఉంటారు. అందుకే ప్రతిరోజు ఈ ఆహారాన్ని కనుక తీసుకుంటే నరాల బలహీనత నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజు అన్నంతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మనం ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉండగలుగుతాం.

పచ్చికొబ్బరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని నిత్యం వంటల్లో స్వీట్ల తయారీలో వాడతారు. పచ్చి కొబ్బరిని నేరుగా తిన్నా కూడా అంతే మేలు జరుగుతుంది. నరాల బలహీనత ఉన్నవారు ప్రతిరోజు పచ్చికొబ్బరి తినాలి. పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు నరాలను బలంగా తయారు చేస్తాయి. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ప్రస్తుతం చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారికి పచ్చికొబ్బరి ఒక వరం అని చెప్పవచ్చు పడుకునే అరగంట ముందు పచ్చి కొబ్బరిని తినడం వలన మంచి నిద్ర వస్తుంది. ఈ విధంగా రోజు పచ్చికొబ్బరి తినడం వలన ఆరోగ్యంగా బలంగా ఉంటారు. వారానికి రెండు సార్లు అయినా ఈ పచ్చి కొబ్బరిని తీసుకుంటే ఎముకలు, నరాలు బలంగా ఉంటాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.

Nerve weaknes patients take these food get strong

Nerve weaknes patients take these food get strong

అంతేకాకుండా పచ్చి కొబ్బరి తినడం వలన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అన్నింటికి మించి పచ్చి కొబ్బరిని తింటే బరువు అసలు పెరగరు. ఇందులో ఉండే మంచి కొలెస్ట్రాల్ మన బాడీకి అందుతుంది. దీంతో మనం చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే పచ్చికొబ్బరికి కాంబినేషన్ అరటిపండు. రెండు పుట్ల భోజనం చేస్తే ఎంత శక్తి అందుతుందో ఒక పూట కొంచెం కొబ్బరి కొన్ని అరటి పండ్లు తీసుకుంటే అంత శక్తి మనకు అందుతుంది. కచ్చితంగా వారంలో రెండు సార్లు అయినా ఈ కొబ్బరిని తింటే శరీరంలో అత్యవసర పోషకాలు అందుతాయి. వీటిలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలను తగ్గించి డయాబెటిస్ ను నియంత్రిస్తుంది. అలాగే అవయవాలు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. శరీరంలో దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలో దోహదపడుతుంది. అలాగే వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయకారిగా పనిచేస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది