Tea : ఇలాంటి టీ తాగుతున్నారా..? అయితే ఈ వివరాలను తెలుసుకోవాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : ఇలాంటి టీ తాగుతున్నారా..? అయితే ఈ వివరాలను తెలుసుకోవాల్సిందే..!

 Authored By ramu | The Telugu News | Updated on :16 December 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ఇలాంటి టీ తాగుతున్నారా..? అయితే ఈ వివరాలను తెలుసుకోవాల్సిందే..!

Tea  : ప్రతిరోజు టీ తాగoదే పొద్దు గడవదు. ఉదయం ఒక కప్పు టీ తాగిన తర్వాతనే మన పనులన్నీ చేసుకుంటాo. చాలామందికి ఇష్టమైన పానీయం, భారతదేశంలో టీ అనేది మన జీవన శైలిలో ఒక భాగం. టీ లో వివిధ రకాల రుచులు కూడా ఉంటాయి. అయితే పాలతో చేసిన టీ ఆరోగ్యానికి ప్రయోజనకరమా, లేక హానికరము అని ప్రశ్నకు జవాబు ఒకటి కాదని. ఇది వ్యక్తి ఆరోగ్యం, వారి జీవనశైలి, మరియు టీ తాగే పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. అయితే పాలతో చేసిన టీ’లో క్యాల్షియం, విటమిన్’ డి శరీరానికి శక్తిని ఇస్తాయి. దీనిలో ఉండే క్యాల్షియం ఎముకలను బలపరుస్తుంది. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. తెల్లని పాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అయితే ఈ పాలు టీ వల్ల కలిగే అనాధలు కూడా ఉన్నాయి.
జీర్ణ వ్యవస్థ పై పాలటీ ప్రభావం….!

Tea ఇలాంటి టీ తాగుతున్నారా అయితే ఈ వివరాలను తెలుసుకోవాల్సిందే

Tea : ఇలాంటి టీ తాగుతున్నారా..? అయితే ఈ వివరాలను తెలుసుకోవాల్సిందే..!

Tea  : 1) లాప్టోస్ అసహనత (lactose intolerance )

పాలలో లాక్టోస్ అనే ఆమ్లం ఉంటుంది. ఈ లాక్టోజ్ అనే ఆమ్లం చెక్కలను కొంతమందికి జీర్ణం చేయలేదు. అయితే ఇది గ్యాస్, నొప్పి వంటి జీవ సమస్యలకు దారి తీస్తుంది. పాలతో చేసిన టీ’ రోజు తాగేవారికి లాక్టోస్ అసహనతో ఉన్నట్లయితే, ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.

Tea  2) టానిన్ ప్రభావం

టీ ‘ ఆకుల్లో ఉండే టానిన్స్, పాలతో కలిపినప్పుడు ఆహారంలోని ఆహారంలోని ఐరన్ ను శరీరానికి అందకుండా అడ్డుపడుతుంటాయి. దీనివల్ల, తరచుగా పాల టీ తాగే వారికి ఐరన్ లోపం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. టీ అధికంగా తాగేవారికి రక్తహీనత సంభవిస్తుంది.

3) అసిడిటీ (acidity )

పాలటీ ఎక్కువగా తాగటం ఆమ్లపితం అంటే ఆసిడిటీ సమస్యకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. టీ ‘ఆకులలోని కెఫైన్ జీర్ణస్రావాలపై ప్రభావం చూపి, గ్యాస్ మరియు అసిడిటీ వంటి సమస్యలకు కారణం అవుతుంది. జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. తద్వారా ఆకలి తగ్గిపోయి బరువు కూడా తగ్గిపోతారు.

4) చక్కెర వినియోగం  : అయితే పాలతో చేసిన టీలో ఎక్కువగా చక్కని కలపడం ఒక సాధారణ అలవాటు. ఈ చక్కెర అధికంగా కలపడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మరియు బరువు పెరగడం సమస్యలు వస్తాయి.

పాలతో చేసిన టీ తాగడం వల్ల కలిగే ఇతర ప్రభావాలు : అయితే పాలతో చేసిన టీ ని తాగటం వలన నిద్ర లేని సమస్య, చురుకుదనం లోపం వంటి సమస్యలు తగ్గించవచ్చు. టి ఆకులలోని యాంటీ ఆక్సిడెంట్లు కొంతమేరకు శరీరానికి ప్రయోజనం కలిగించవచ్చు. రోజుకు రెండు లేదా మూడు కప్పుల కంటే ఎక్కువ పాలు టీ తాగటం శరీరానికి హాని కలిగించవచ్చు. ఇట్టి ఆకులలో ఎప్పుడైనా అధికమవుతాదిలో ఉండడం వల్ల మానసిక ఆందోళన, అధిక రక్తపోటు, మరియు జీర్ణ సమస్యలు రావచ్చు.

ఆరోగ్యకరమైన

ప్రత్యామ్నాయాలు : కొంతమంది పాలు లేకోకుండా డికాషన్ టి’ అంటే బిల్లా టీ ‘ అసిడిటీ, లాక్టోస్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేద హెర్బల్స్ లేదా గ్రీన్ టీ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. ఇవి శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించవు. అధికంగా చక్కెర వేయకుండా ఉండడం మంచిది. చక్కెరకు బదులు స్టీవియా లేదా తేనె వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చు. పాలిటి అనేది శ్రేష్టమైన ఆహారపు ఆలోచనగా ఉన్నప్పటికీ, దీనికి సరైన మోతాదులో మరియు సరైన సమయంలో తాకటం అత్యంత ముఖ్యం. చాలా తక్కువగా తీసుకుంటే ఇది హానికరం కాదు. కానీ రోజువారి అలవాటులో ఉండే వారికి, రోజుకి నాలుగు ఐదు సార్లు తీసుకునే వారికి జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవటం సాధ్యమే, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిని బట్టి పానీయాలను ఎంచుకోవడం ఉత్తమం. రోజుకి ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ మోతాదులో పాలటీని సేవిస్తే ఆరోగ్యానికి హానికరం అని చెబుతున్నారు నిపుణులు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది