Parenting Tips : పసిపిల్లలు ఉన్నట్లుండి గుక్కపట్టి ఏడుస్తారు…ఇలా చేసారంటే… బోసి నవ్వులు కాయం…?
ప్రధానాంశాలు:
Parenting Tips : పసిపిల్లలు ఉన్నట్లుండి గుక్కపట్టి ఏడుస్తారు...ఇలా చేసారంటే... బోసి నవ్వులు కాయం...?
Parenting Tips : సాధారణంగానే చిన్నపిల్లలు ఒక్కోసారి ఎందుకు ఏడుస్తారు మనం అస్సలు అర్థం కాని విషయం. వారిని ఏడవకుండా ఏ విధంగా వాళ్ళని బుజ్జగించాలో తల్లిదండ్రులు తికమక పడిపోతుంటారు. అయితే ఈ సమస్యకు సింపుల్ చిట్కా చెబుతున్నారు వైద్యులు. అసలు పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు, అలసిపోయిన, అనారోగ్య సమస్య ఉన్న వారి భావాలను ఏడుపు ద్వారా మనకు తెలియజేస్తారు. పసిపిల్లల నిర్మలమైన బోసి నవ్వులు చూస్తే మనసులోని బాధ అంతా ఇట్లే కరిగిపోతుంది. ఒక్కోసారి పిల్లలు హఠాత్తుగా ఏడుస్తుంటారు. వాళ్లని ఏడవకుండా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తికమక పడిపోతుంటారు.అయితే ఈ సమస్యకు నిపుణులు ఈజీగా ఈ చిట్కా అని తెలియజేస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ఆకలి వేసినప్పుడు, అలసిపోయిన, ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిన ఏడుపు ద్వారా తమ భావాలను మనకి వ్యక్తపరుస్తారు. కాబట్టి, పసి పిల్లలు ఎందుకు నవ్వుతారో, ఎందుకు ఏడుస్తారు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది తల్లిదండ్రులకు.

Parenting Tips : పసిపిల్లలు ఉన్నట్లుండి గుక్కపట్టి ఏడుస్తారు…ఇలా చేసారంటే… బోసి నవ్వులు కాయం…?
Parenting Tips పిల్లలు హఠాత్తుగా ఏడిస్తే ఏం చేయాలి
పిల్లల్ని హఠాత్తుగా ఏడ్చే ఏడుపుని ఆపాలి అంటే నిపుణులు ఈ చిట్కాలను సూచిస్తున్నారు. పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటే లైట్లు ఆపివేసి చీకటి గదిలో ఉంచాలి. పిల్లలను శాంతింప చేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఇది ఒకటి. చిన్నపిల్లలు ఎప్పుడూ ఏడ్చిన చీకటి గదిలోకి తీసుకెళ్లి వారిని సముదాయిస్తే వెంటనే ఏడుపు ఆపేస్తారు. ఇంకా పిల్లల పాదాల మధ్యలో నొక్కడం ద్వారా కూడా వారి ఏడుపుని ఆపవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ కడుపులో గ్యాస్ కారణంగా ఏడిస్తే.. ఉపాయాలు ఉపయోగిస్తే నొప్పి తగ్గిపోతుంది. తద్వారా పిల్లలు ఏడుపును ఆపివేస్తారు. కొంతమంది పిల్లలు జలుబు వల్ల వచ్చే తలనొప్పి వల్ల కూడా ఏడవవచ్చు. పిల్లల వేళను మూడు నిమిషాల కంటే ఎక్కువ సేపు చిన్నగా నొక్కడం ద్వారా వారు ఉపశమనం పొంది నిద్రపోతారు. ఇలా చేస్తే వారి తలనొప్పి కూడా తగ్గుతుంది. ప్రయత్నాలు చేసినా కూడా పిల్లలు ఏడుపు ఆపకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.