R.V Foundation : ఘనంగా ఆర్.వి ఫౌండేషన్ చలివేంద్రాల ప్రారంభం

 Authored By prabhas | The Telugu News | Updated on :19 March 2026,7:30 pm

ప్రధానాంశాలు:

  •  R.V Foundation : ఘనంగా ఆర్.వి ఫౌండేషన్ చలివేంద్రాల ప్రారంభం

R.V Foundation : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఆర్.వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను రేకెత్తించింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు చల్లని, సురక్షితమైన మంచినీరు అందించేందుకు ఫౌండేషన్ ముందడుగు వేసింది. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రజలకు ఉగాది పచ్చడి పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయకులు చలివేంద్రాలను ప్రారంభించి ఆర్.వి ఫౌండేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. సామాజిక సేవ పట్ల తుంగతుర్తి రవి చూపుతున్న నిబద్ధత అభినందనీయమని పేర్కొన్నారు. “మానవసేవే మాధవ సేవ” అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు.

Grand inauguration of RV Foundation winter camps

R.V Foundation : ఘనంగా ఆర్.వి ఫౌండేషన్ చలివేంద్రాల ప్రారంభం

ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా ప్రతి ఉగాది రోజు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నామని తెలిపారు. ఎండాకాలంలో ప్రయాణికులు, వాహనదారులు దాహంతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈసారి ప్రజలు ఎక్కువగా సంచరించే తొమ్మిది ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిరంతరం శుభ్రమైన చల్లని నీరు అందుబాటులో ఉంచామని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువకులు, కాలనీల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ తుంగతుర్తి రవి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సేవే తన లక్ష్యమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇక ఈ ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ యాదవ్,బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,మాజి డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, సుభాష్ నాయక్, బుచ్చి యాదవ్, అనంత రెడ్డి, పప్పుల అంజిరెడ్డి,కావడపు రాంరెడ్డి జలేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,కవిడ కుమార్, భాస్కర్,రంజిత్ కుమార్ రెడ్డి,ముదిగొండ రమేష్,మోహన్ కుమార్,పవన్ గౌడ్, యసారం నాగేష్,మణిరం నాయక్,సోమయ్య, సింగం లక్ష్మణ్,మహ్మద్ మజర్,బర్ల నాగరాజు,వేణుగోపాల్ రెడ్డి,ఆసర్ల బీరప్ప,అమర్నాథ్,రవి యాదవ్,శరత్ గౌడ్, కపిల్,కొల్తూరు సాయి, ఉమేష్ రెడ్డి,సాయి రెడ్డి,పఠాన్,సుదీర్,నాగరాజు,శ్రీకాంత్ పటేల్,విక్రమ్ గౌడ్, శ్రవణ్,మహిళా నాయకులు వరలక్ష్మి,NNK దుర్గ, అంజమ్మ, పరమేశ్వరి,మరియు మాజీ కార్పొరేటర్లు,కంటెస్టెడ్ కార్పొరేటర్లు,వార్డు ఇంచార్జ్ లు యువకులు, వివిధ కాలనీల ప్రజలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

 

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి