Health Benfits : పాలకంటే పది రెట్లు ఎక్కువ బలాన్నిచ్చే ఆ ఆకుకూర ఏంటో తెలుసా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Health Benfits : పాలకంటే పది రెట్లు ఎక్కువ బలాన్నిచ్చే ఆ ఆకుకూర ఏంటో తెలుసా..!

Health Benfits : పాలకంటే పది రెట్లు ఎక్కువ బలాన్నిచ్చే పొన్నగంటి కూర గురించి తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా దొరికే ఈ పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొన్నగంటి కూరను వృక్ష శాస్త్ర ప్రకారం ఆల్టర్ నాంథెరా సెసిలిస్ గా పిలుస్తారు. ఈ పొన్నగంటి కూరను వంటల్లోనే కాకుండా ఆయుర్వేద మూలికల్లో కూడా వాడతారు. అమరాంతసీ కుటుంబానికి చెందిన ఈ పొన్నగంటి కూరను… మత్స్యాక్షి, పొన్నంకన్ని కీరై, పొన్నంగన్ని, […]

 Authored By pavan | The Telugu News | Updated on :24 February 2022,3:00 pm

Health Benfits : పాలకంటే పది రెట్లు ఎక్కువ బలాన్నిచ్చే పొన్నగంటి కూర గురించి తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. దేశవ్యాప్తంగా దొరికే ఈ పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొన్నగంటి కూరను వృక్ష శాస్త్ర ప్రకారం ఆల్టర్ నాంథెరా సెసిలిస్ గా పిలుస్తారు. ఈ పొన్నగంటి కూరను వంటల్లోనే కాకుండా ఆయుర్వేద మూలికల్లో కూడా వాడతారు. అమరాంతసీ కుటుంబానికి చెందిన ఈ పొన్నగంటి కూరను… మత్స్యాక్షి, పొన్నంకన్ని కీరై, పొన్నంగన్ని, ముకునువెన్న, గుడారి సాగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది పంట పొలాల్లో నీరు పారే కాలువల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఈ మొక్కను గుర్తించడం చాలా తేలిక.

అయితే ఈ పొన్నగంటి కూర కేవలం నీరు ఉన్న దగ్గరే కాకుండా వేడి వాతావరణంలో కూడా పెరుగుతుందట.పొన్నగంటి కూరను దీనిని ఆకు కూరంగా వండుకని తింటుంటారు చాలా మంది. మరికొందరు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగిస్తారు. పొన్నగంటి కూర ఆకుల్లో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం మరియు విటామిన్ సి, ఎ లు అధికంగా ఉంటాయి. పొన్నగంటి కూరను సలాడ్, ఆకు కూరలుగా వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పొన్నగంటి కూరలో పీచు పధార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వాటిని పాలకూర కాడలను కోసినట్లుగా కోయకుండా కేవలం ఆకులను మాత్రమే వండుకొని తినాలి. ఆకులను పప్పులో ఉడికించి, సూప్ లు, ఫ్రైలు కూరలుగా తింటారు.

ponnaganti kura super health benfits

ponnaganti kura super health benfits

రిఫ్రిజిరేటర్ లో ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ చేసినప్పుడు అవి రెండ్రోజులు నిల్వ ఉంటాయి. మన పూర్వీకులు చెప్పిన దాన్ని బట్టి పొన్నగంటి కూర ఆకులను 48 రోజులపాటు ప్రతిరోజూ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయట.పొన్నగంటి కూరలో ఉండే బీటా కెరోటిన్, విటామిని ఏలు మన కళ్లను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా కళ్ల అందాన్ని కూడా మెరుగుపరుస్తాయి. రెండ్రోజులు పొన్నగంటి ఆకులను తింటే మొహంపై సహజమైన గ్లో వస్తుందట. అంతే కాకుండా ఈ ఆకుల రసాన్ని తలనొప్పి తగ్గించేందుకు, శరీరంలోనే వేడిని తగ్గించేందుకు ఉపయోగిస్తారట.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది