Potato Juice : ఆలుగడ్డ జ్యూస్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా.? తెలిస్తే వెంటనే తాగడం మొదలు పెడతారు..!!
ప్రధానాంశాలు:
Potato Juice : ఆలుగడ్డ జ్యూస్ తో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా.? తెలిస్తే వెంటనే తాగడం మొదలు పెడతారు..!!
Potato Juice : ఆలుగడ్డ తో ఎన్నో రకాల వంటకాలను చేస్తూ ఉంటారు. ఆళ్లగడ్డ చిప్స్, ఆళ్లగడ్డ స్లైసెస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలుగడ్డ బజ్జి, ఆలుగడ్డ కుర్మ్,ఆలుగడ్డ ఫ్రై ఇలా ఎన్నో రకాల వంటకాలను వండుతూ ఉంటారు. దీనిని చాలామంది ఇష్టంగానే తింటూ ఉంటారు.. అయితే ఆలుగడ్డతో జ్యూస్ ఎప్పుడైనా చేసుకున్న తాగారా..? జ్యూస్ అని ఆశ్చర్యపోతున్నారా.. మనం ఆలుగడ్డతో కొన్ని రకాల వంటలు అయితే చేసుకునే సంగతి అందరికి తెలిసింది. కానీ ఆలు జ్యూస్ తీసుకోవడం వలన మానవ శరీరానికి చాలా రకాల ఉపయోగాలు ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది.పరిశోధన ప్రకారం ఆలుగడ్డలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో శరీరంలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఆలుగడ్డ జ్యూస్ తీసుకోవడం వలన కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి.
ఈ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో ఎలాంటి ఇన్ఫెక్షన్లైన అయిన ఇట్టే తగ్గుతాయి. మైగ్రేన్ తో ఇబ్బంది పడేవారు ఆలుగడ్డ జ్యూస్ ను తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆలుగడ్డ జ్యూస్ తో రోజు వారికి కావలసిన విటమిన్లు పొందవచ్చు. ఆలుగడ్డ జ్యూస్తో చర్మ ఇబ్బందులు కూడా తగ్గుతాయి. వయసు పైబడిన లక్షణాలను తగ్గిస్తుంది..ఆలుగడ్డ జ్యూస్ ప్రతిరోజు తాగడం వలన సహజ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.నాడీ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. బంగాళదుంప జ్యూస్ లో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్య నుంచి బయటపడేస్తుంది.
ఆలుగడ్డ జ్యూస్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారి నుంచి బయటపడవచ్చు. ఇలా ఆలుగడ్డ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రోగాల నుంచి రక్షిస్తుంది. ఆలుగడ్డను తీసుకుంటే నొప్పులొస్తాయని చాలామంది అనుమాన పడుతూ ఉంటారు. ఆలుగడ్డ జ్యూస్ ను తాగితే చాలావరకు బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఎలాంటి కీళ్ల నొప్పులు లేకుండా చేస్తుంది. అలాగే హై బీపీ నుంచి విముక్తి కలిగిస్తుంది..