
Sunstroke : ఎండల్లో తప్పక బయటకు వెళ్లాల్సి వస్తుందా... అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Sunstroke : ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. బయటకి వెళ్లాలంటే గజగజ వణికిపోవల్సిన పరిస్థితి. చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్లు సైతం ఎండలకి భయబ్రాంతులకి గురవుతున్నారు.ఎండల నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతారణ నిపుణులు సూచిస్తున్నారు. వడ దెబ్బతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందట. ఎండ వేడిమికి తట్టుకోలేక మృత్యువాత పడుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కువ సేపు ఎండలో తిరిగితే ఏదో ఒక సమస్య వస్తుంది. అందుకే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రుమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి.
Sunstroke : ఎండల్లో తప్పక బయటకు వెళ్లాల్సి వస్తుందా… అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగండి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓఆర్‌యస్ కలిపిన నీటిని తాగవచ్చును. వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని, నిమ్మరసము గాని, కొబ్బరినీరు గాని తాగాలి. ఎండ నుంచి ముఖాన్ని రక్షించుకోవడానికి టోపీలు, సన్ గ్లాసెస్, గొడుగులను ఉపయోగిస్తే మంచింది. ఎండ వేడి నుంచి రక్షణ పొందడానికి కాటన్ స్కార్ఫ్‌తో తల, ముఖాన్ని కవర్ చేసుకోవాలి. తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తల తిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి. ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీరుతో స్నానం చేయండి.
Sunstroke : ఎండల్లో తప్పక బయటకు వెళ్లాల్సి వస్తుందా… అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్‌ను ఉపయోగించడం చేస్తే మంచిది. శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్దాలను తీసుకోవద్దు. ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి. ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకొనకూడదు. శీతల పానీయములు మరియు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యము ఏర్పడుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.