Viral Video : దాహంతో ఉన్న మనిషికి నీళ్లు అందించిన ఏనుగు.. వీడియో చూసి అందరు షాక్
Viral Video : ఏనుగుని చూడగానే మనం భయబ్రాంతులకి గురవుతూ ఉండడం సహజం. దాని ఆకారం చూసే ఉలిక్కిపడుతుంటాం. అయితే మావటి వాడు మాత్రం కొన్ని ఏనుగులని ఊర్లలో తిప్పుతూ అందరికి ఉత్సాహాన్ని అందిస్తుంటాడు. ఏనుగు అడవిలో కెల్లా అతిపెద్ద శరీరం కలిగినది ఇదే. ఏనుగులు వేల కిలోల బరువును కలిగి ఉంటాయి. గజరాజు తమ పాదాల కింద పడ్డది ఏదైనా సరే.. చూర్ణం చేసే సత్తా ఉంటుంది. దానికి ఆగ్రహం వస్తే చుట్టూ అంతా నాశనం చేయగలవు. కానీ, ఏనుగులు మనిషికి మంచి మిత్రులుగా ఉంటాయి. ఎందుకంటే.. ఏనుగులు తెలివైన జంతువులు అని అంటుంటారు. అడవిలో మెరుగ్గా ఉండే ఏనుగులు ఊర్లలోకి వస్తే భీబత్సం సృష్టిస్తాయి.
ఏనుగులు జనవాసాల్లో చేరితే దాన్ని ఎదుర్కొవటం ఎవరి వల్ల కాదు..అటవీ సమీప గ్రామాల్లో తరచుగా ఏనుగుల రాక, పంట పొలాలపై ఏనుగుల మంద దాడికి చేయటం, పంటపొలాల్లో విధ్వంసం చేయటం మనం చాలా చూశాం. అడవిలో కావాల్సిన ఆహారం దొరక్కపోవటంతో ఏనుగులు జనావాసంలోకి చొరబడి అన్నింటిని నాశనం చేస్తున్నాయి. తొండంతో భీబత్సం సృష్టిస్తుంది. అయితే తాజాగా ఓ ఏనుగు మనిషి దాహం తీర్చి అందరిని ఆశ్చర్యపరచింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకా కమలాపూర్ లోని ఏనుగుల పార్క్ లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మండుతున్న ఎండలో ఓ వ్యక్తి దాహం తీర్చేందుకు ఏనుగు తొండంతో హ్యాండ్ పంప్ కొట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆ పార్కులోని గార్డు సుదీప్ ఏనుగు సాయంతో నీళ్లుతాగి దాహం తీర్చుకున్నాడు. అతడి దాహం తీర్చిన ఏనుగు రూపకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అక్కడి ఏనుగుల పార్కులో ప్రస్తుతం తొమ్మిది ఏనుగులు ఉన్నాయి. చుట్టు పక్కల నీటి వనరులు అంతరించిపోయినప్పుడు ఏనుగులు ఇలా హ్యాండ్ పంప్ కొడతాయని ఏనుగు క్యాంప్ నిర్వాహకులు చెప్పారు.ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మనుషులతో కొన్ని మూగ జీవాలు చాలా సన్నిహితంగా ఉంటూ వారికి కష్టనష్టాలలో అండగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.
Oats | వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదు. అయితే, అల్పాహారంగా ఓట్స్ తినడం ఆరోగ్యవంతమైన…
Copper Sun Vastu Tips | హిందూ ధర్మంలో సూర్యుడు ప్రత్యక్ష దేవతగా పూజించబడతాడు. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాధిపతిగా విశిష్ట స్థానం…
KTR Responds to Kavitha issue for the first time : బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ తన…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. అత్యాధునిక…
This website uses cookies.