Pregnancy : ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ చక్కెర పానీయాలు తాగితే… పొట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pregnancy : ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ చక్కెర పానీయాలు తాగితే… పొట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా…!

Pregnancy : మన ఆరోగ్యానికి చక్కెర పానీయాలు అనేవి ఎంతో ప్రమాదకరం అని మన అందరికీ తెలుసు. అయితే ఈ చక్కెర పానీయాలను తీసుకోవటం వలన దత్త సమస్యలు మరియు బరువు పెరగడం,మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలి వ్యాధులు కూడా వస్తాయి. అలాగే ప్రెగ్నెంట్ టైం లో చక్కెర పానియాలు తాగే మహిళలకు పుట్టబోయే పిల్లలకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని తాజా పరిశోధనలో తేలింది. అయితే పీర్ రీవ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్ లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :8 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Pregnancy : ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ చక్కెర పానీయాలు తాగితే... పొట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా...!

Pregnancy : మన ఆరోగ్యానికి చక్కెర పానీయాలు అనేవి ఎంతో ప్రమాదకరం అని మన అందరికీ తెలుసు. అయితే ఈ చక్కెర పానీయాలను తీసుకోవటం వలన దత్త సమస్యలు మరియు బరువు పెరగడం,మధుమేహం, అధిక రక్తపోటు లాంటి దీర్ఘకాలి వ్యాధులు కూడా వస్తాయి. అలాగే ప్రెగ్నెంట్ టైం లో చక్కెర పానియాలు తాగే మహిళలకు పుట్టబోయే పిల్లలకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అని తాజా పరిశోధనలో తేలింది. అయితే పీర్ రీవ్యూడ్ జర్నల్ న్యూట్రియెంట్స్ లో ప్రచురింపబడిన ఒక అధ్యయన ప్రకారం చూసినట్లయితే, ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ మొత్తంలో చక్కెర పానీయాలను తీసుకునే మహిళలు వారిపై మరియు వారికి పుట్టబోయే బిడ్డపై కూడా ప్రతికూల ప్రభావాలు చూపుతాయి అని అంటున్నారు. అయితే ఈ సర్వే అనేది ఏప్రిల్ మరియు జూన్ 2022, 2023లో నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వేలో 4,000 మందికి పైగా గర్భిణీ మహిళలు ఉన్నారు. అయితే ఈ సర్వే సందర్భంగా గర్భిణీ మహిళలందరి కి పండ్ల రసం మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్, ఫీజీ డ్రింక్స్, సోడా, జ్యూస్, మిల్క్ డ్రింక్ లాంటివి ఇవ్వడం జరిగింది.

ఈ సర్వే చివరిలో చక్కెర పానీయాలు ఎక్కువగా తీసుకునే మహిళలు ప్రెగ్నెంట్ టైం లో మధుమేహ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు అని తేలింది. అయితే ప్రెగ్నెంట్ టైం లో వచ్చే మధుమేహ సమస్య ను జెస్టేషనల్ డయాబెటిస్ అని అంటారు. అయితే ప్రెగ్నెంట్ టైం లో వచ్చిన మధుమేహ విషయంలో పిల్లలు సాధారణ కంటేఎక్కువ బరువు ఉండవచ్చు. దీని కారణం చేత డెలివరీ టైమ్ లో ఎన్నో రకాల సమస్యలను ఎదురుకోవలసి వస్తుంది. ఇది మాత్రమే కాక ప్రెగ్నెంట్ మధుమేహం కూడా శిశువు అకాల పుట్టుకకు కామెర్ల సమస్యకు దారితీస్తాయి. ఈ సర్వేలో వారానికి మూడు సార్లు చక్కెర పానీయాలను తీసుకునే మహిళలు ప్రెగ్నెంట్ టైంలో మధుమేహం వచ్చే ప్రమాదం 38 శాతం వరకు అధికంగా ఉన్నట్లు కనుక్కున్నారు. అంతేకాక ఈ మహిళల్లో ప్రెగ్నెంట్ రక్తపోటు ప్రమాదం 64% వరకు అధికంగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. మహిళలు ప్రెగ్నెంట్ టైంలో చక్కెర పానీయలను ఎక్కువగా తీసుకోవడం వలన పిండానికి తగిన రక్తం లభించదు. దీని కారణం చేత పిండం పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అని సర్వేలో తేలింది. అంతేకాక అకాల డెలివరీ ప్రమాదం కూడా పెరుగుతుంది…

Pregnancy ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ చక్కెర పానీయాలు తాగితే పొట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా

Pregnancy : ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ చక్కెర పానీయాలు తాగితే… పొట్టబోయే బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా…!

ఈ చక్కెర పానీయాలను వారానికి నాలుగు సార్లు తీసుకోవడం వలన మక్రో సోమియా ప్రమాదాలను ఎక్కువగా పెంచుతుంది. అయితే ఈ సర్వే ముగింపులో ప్రెగ్నెంట్ టైం లో ఎక్కువ మొత్తంలో చక్కెర పానీయాలను తీసుకోవడం వలన గర్బదారణ మధుమేహం మరియు గర్భధారణ రక్తపోటు ప్రమాదాలను మరింతగా పెంచుతుంది అని పరిశోధనలో తేలింది. ఇది మాత్రమే కాకుండా మక్రోసోమియా ప్రమాదాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అని అన్నారు. అయితే మహిళలు ప్రెగ్నెంట్ టైం లో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే మహిళలు తమ ఆహారంపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని అంటున్నారు. అంతేకాక ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలను గరిష్ట పరిమాణంలో తీసుకోవడం చాలా ముఖ్యం అని పరిశోధకులు అంటున్నారు…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది