Pregnancy : గర్భధారణ టైంలో కాల్షియం లోపిస్తే… ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసా…!
Pregnancy : ప్రతి మహిళ తమ జీవితంలో ప్రెగ్నెంట్ అవ్వడం అనేది కీలక ఘట్టం. అయితే మరొక జీవికి జన్మనిస్తున్నాను అన్న సంతోషం ఒకవైపు మరియు ఏదో ఒక తెలియని భయం మరొకవైపు వారిని వెంటాడుతుంది. ఇవన్నీ కూడా మహిళల్లో మానసిక ఇబ్బందులకు దారి తీస్తాయి. అందుకే గర్భిణీలు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో మీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తల్లీ తో పాటు […]
ప్రధానాంశాలు:
Pregnancy : గర్భధారణ టైంలో కాల్షియం లోపిస్తే... ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసా...!
Pregnancy : ప్రతి మహిళ తమ జీవితంలో ప్రెగ్నెంట్ అవ్వడం అనేది కీలక ఘట్టం. అయితే మరొక జీవికి జన్మనిస్తున్నాను అన్న సంతోషం ఒకవైపు మరియు ఏదో ఒక తెలియని భయం మరొకవైపు వారిని వెంటాడుతుంది. ఇవన్నీ కూడా మహిళల్లో మానసిక ఇబ్బందులకు దారి తీస్తాయి. అందుకే గర్భిణీలు ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ టైంలో మీరు తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే తల్లీ తో పాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడాఎంతో అవసరమైన పోషకాలు అందేలా ఆహారాన్ని తీసుకోవాలి అని అంటున్నారు. అయితే మహిళలు ప్రెగ్నెంట్ టైం లో విటమిన్స్ లోపం అస్సలు ఉండకూడదు. ముఖ్యంగా కాల్షియం లోపం వస్తే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మహిళల ప్రెగ్నెంట్ టైం లో కాల్షియం అనేది శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. అయితే ఈ కాల్షియం పోషించే కీలక పాత్ర ఏమిటి.? దీని లోపం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుందాం…
కాల్షియం అనేది ఎముకలు మరియు దంతాలను బలంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది అది చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే మహిళల ప్రెగ్నెంట్ టైం లో శిశువుల ఎముకలు మరియు దంతాలు అనేవి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతాయి. దీనికి కాల్షియం అనేది ఎంతో ముఖ్యం. అయితే శిశువుకు కాల్షియం అనేది తల్లి శరీరం నుండి లభిస్తుంది. అయితే తల్లి శరీరంలో కాల్షియం లోపం అనేది ఉన్నట్లయితే ఇది పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావం పడుతుంది. అంతేకాక ప్రెగ్నెంట్ తో ఉన్న మహిళలు ఎముకలు కూడా ఎంతో బలహీనంగా మారతాయి. దీని వలన భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధి లాంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇకపోతే పొట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై కూడా కాల్షియం లోపం తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో ఎముకలు అనేవి సరిగ్గా అభివృద్ధి చెందవు.అలాగే శిశువు గుండె మరియు కండరాలతో పాటుగా నరాల అభివృద్ధి పై కూడా ప్రభావం పడుతుంది…
తల్లి కడుపులోనే బిడ్డ తగినంత కాల్షియం పొందకపోతే, ఇది భవిష్యత్తులో పిల్లల ఆరోగ్యం పై ఎంతో ప్రభావం పడుతుంది. అలాగే ప్రెగ్నెంట్ టైం లో స్త్రీలకు రోజు 1000 నుండి 1200mg కాల్షియం అవసరం ఉంటుంది. ఇది పాలు మరియు పెరుగు, జున్ను, ఆకుకూరలు, నువ్వులు, బాదం లాంటి ఆహారాల పదార్థాలు నుండి లభిస్తుంది. అయితే ఈ నువ్వుల వలన వేడి చేసే అవకాశం కూడా ఉంటుంది. కావున మీకు కాల్షియం లోపం గనక ఉన్నట్లయితే వైద్యుల సలహా మేరకు కాల్షియం టాబ్లెట్లను తీసుకోవాలి…