Red Aloe Vera : రెడ్ కలబందలో శక్తిమంతమైన ప్రయోజనాలు ఉన్నాయి… ఆకుపచ్చ కలబంద కంటే ఎక్కువ ప్రయోజనాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Red Aloe Vera : రెడ్ కలబందలో శక్తిమంతమైన ప్రయోజనాలు ఉన్నాయి… ఆకుపచ్చ కలబంద కంటే ఎక్కువ ప్రయోజనాలు…!!

Red Aloe Veraకలబంద అంటే అందరికీ తెలిసిన మెక్కే.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.. ఈ కలబంద మొక్క దాదాపు అందరూ ఇళ్లల్లో ఉంటుంది. అయితే ఆకుపచ్చ కలబంద కంటే రెడ్ కలబంద ఎక్కువ ప్రయోజనకరమైనదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రెడ్ కలర్ లో ఉండే ఈ కలబంద మొక్క ఔషధ గుణాలు గని. రెడ్ కలర్ కలబంద మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని సమయాలలో ఇది ఆకుపచ్చ కలబంద కంటే అధిక […]

 Authored By aruna | The Telugu News | Updated on :8 February 2024,10:00 am

Red Aloe Veraకలబంద అంటే అందరికీ తెలిసిన మెక్కే.. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.. ఈ కలబంద మొక్క దాదాపు అందరూ ఇళ్లల్లో ఉంటుంది. అయితే ఆకుపచ్చ కలబంద కంటే రెడ్ కలబంద ఎక్కువ ప్రయోజనకరమైనదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. రెడ్ కలర్ లో ఉండే ఈ కలబంద మొక్క ఔషధ గుణాలు గని. రెడ్ కలర్ కలబంద మొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని సమయాలలో ఇది ఆకుపచ్చ కలబంద కంటే అధిక ఉపయోగాలు ఉంటాయని ఓ పరిశోధనలో తెలిసింది. ఎరుపు కలబంద వలన కలిగే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… ఎరుపు కలబందలో ఉండే పోషకాలు ఇవే… ఎరుపు కలబందలో అధిక మొత్తంలో విటమిన్లు ఉంటాయి. శక్తివంతమైన ఎరుపు కలబందలో విటమిన్ ఏ, బి 1 యంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ ఆంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతాయి. ఇది అధిక మొత్తంలో అమైనో ఆమ్లాలు కలిగిఉంటుంది.

చర్మం మరియు జుట్టుకు, కళ్ళకు ఔషధంలా ఉపయోగపడుతుంది..

*షుగర్ నియంత్రణ : డయాబెటిస్ రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో ఉపయోగపడుతుంది. టైప్ టు డయాబెటిస్ లో పరిమిత రూపంలో దీని వినియోగం ఉపయోగకరంగా ఉంటుంది.

*జుట్టు మెరిసేలా చేస్తుంది : రెడ్ కలబందను జుట్టు మీద అప్లై చేయడం వలన జుట్టు మెరిసేలా చేస్తుంది. దాంతో జుట్టు రాలే సమస్య కూడా తగ్గిపోతుంది.

*రక్తపోటుని తగ్గిస్తుంది : రెడ్ కలబంద జ్యూస్ తాగే వ్యక్తులు రక్తపోటు సమస్య నుంచి బయటపడతారు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు ఎర్ర కలబంద జ్యూస్ తాగడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది.

*రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది : రెడ్ కలబంద జ్యూస్ తాగడం వలన రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి శరీరాన్ని కాపాడుతుంది. జలుబు, దగ్గు సమస్యలకు కూడా దూరమవుతాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల శ్వాసకోస ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది..

*పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి : పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఇబ్బంది పడే ఆడవారు రెడ్ కలబంద జ్యూస్ తాగాలి. దీనివలన వారికి మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. అలాగే నొప్పి కూడా తగ్గుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది