Herbal Tea : నిత్యం ఈ హెర్బల్ టీ తీసుకుంటే కిడ్నీల సమస్యకు చెక్ పెట్టవచ్చు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Herbal Tea : నిత్యం ఈ హెర్బల్ టీ తీసుకుంటే కిడ్నీల సమస్యకు చెక్ పెట్టవచ్చు…!

 Authored By aruna | The Telugu News | Updated on :20 May 2023,9:00 am

Herbal Tea : ప్రస్తుతం చాలామంది కిడ్నీల సమస్యతో బాధపడుతూ ఉంటారు. మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరం అంత ప్రవహించే రక్తాన్ని ఫిల్టర్ చేసి అన్ని అవయవాలకు సరఫరా చేస్తూ ఉంటాయి. మూత్ర రూపంలో ఈ వ్యర్ధాలను బయటికి పంపిస్తూ ఉంటుంది. మూత్రపిండాలు శరీరం నుంచి అదనపు నీటిని తొలగిస్తాయి. ఇవి శరీరంలోని వ్యర్ధాలను తొలగించడమే కాకుండా రక్తప్రసరణ కంట్రోల్ ఉంచుతాయి. ఎర్ర రక్త కణాలు తయారు చేయడం ఎముకలను బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అలాగే వీటి పనితీరు సక్రమంగా ఉంటేనే ఇతర అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. లేదంటే అవయవాలు పనిచేయడం మానేసి ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది.

కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోతే హైపర్ టెన్షన్, గుండె సమస్యలు, రక్తహీనత లాంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తాయి. కాబట్టి ఈ కిడ్నీ సమస్యను ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అయితే ఈ కిడ్నీ సమస్యకి నిత్యం ఈ హెర్బల్ టీ తీసుకుంటే చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. ఇప్పుడు ఆ హెర్బల్ టీ గురించి మనం తెలుసుకుందాం.. పసుపు: పసుపు ప్లాస్మా ప్రోటీన్లను మెరుగుపరుస్తుంది. పసుపు మన ఆహారంలో చేర్చుకోవడం వలన కిడ్నీల పనితీరు మెరుగు పడుతుంది. అలాగే కిడ్నీ ఇన్ఫెక్షన్లను కిడ్నీ సమస్యలను దూరం చేస్తుంది.

Regular consumption of this herbal tea can check kidney problems

Regular consumption of this herbal tea can check kidney problems

అల్లం:ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. అల్లం లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కిడ్నీల వాపుని నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
డానడే లైస్ వేరు: ఈ వేరు మూత్రపిండాలని శుభ్రపరచడం లో ఉపయోగపడుతుంది. ఇది మూత్ర వ్యవస్థను బలోపితం చేస్తుంది. తరచుగా ఈ వేరు టీ తాగితే కిడ్నీలలోని టాక్సిన్ తొలగిపోతుంది.
త్రిపుల: త్రిపులను కరక్కాయ, తానికాయ, ఉసిరి కాయతో తయారుచేస్తారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఈ త్రిపుర ప్లాస్మా ప్రోటీన్లను మెరుగుపరుస్తుంది. త్రిపుల ముద్రపిండాలలోని వ్యర్ధాలను తొలగిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది