Relationship : భర్త తన భార్యతో ఎప్పుడు చెప్పకుడని మూడు విషయాలు ఏంటో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :22 October 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Relationship : భర్త తన భార్యతో ఎప్పుడు చెప్పకుడని మూడు విషయాలు ఏంటో తెలుసా...!!

Relationship : భారతదేశంలో వివాహ బంధానికి ఎంతో మంచి పేరు ఉంది. అలాగే వైవాహిక జీవితాన్ని తరచుగా ఏదో ఒక రకంగా పోల్చడం వలన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే భార్య భర్తల మధ్య బంధం ఎంత ఉంటే అంత సున్నితంగా ఉండేందుకు ఇదే కారణం. ఈ బంధాన్ని దృఢంగా ఉంచుకోవాలి అంటే ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే సహజీవనం చేస్తున్నప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు మరియు మనస్పర్ధలు రావడం సహజం. అయితే కోపంలోనూ మరియు తమాషాగానో ఈ దృఢమైన బంధాన్ని బలహీనపరిచే ఇటువంటి మాటలు తన నోటి నుండి చెప్పకూడదు అని భర్త ఎప్పుడు గుర్తుంచుకోవాలి. అయితే ఇంటిని మరియు తన బంధుత్వాలన్నింటిని వదిలేసిన స్త్రీకి భర్త అంటే చాలా గౌరవం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భర్త ఎప్పుడు కూడా కోపంతోనో లేక సరదాగానో మీ భార్య యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే మాటలు అస్సలు ఎప్పుడు మాట్లాడకూడదు. ఇది తరచుగా పెద్ద గొడవలకు కారణం అవుతుంది అని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాలలో బంధం అనేది విచ్ఛిన్నం కూడా కావచ్చు. కావున భర్త తన భార్య గురించి చెప్పకూడని మూడు విషయాలు ఎప్పుడూ మాట్లాడకూడదు అని అంటున్నారు. అయితే అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

Relationship : లుక్స్ గురించి జోక్

ఒక భర్త తన భార్య యొక్క శారీరక రూపాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం లేక జోక్ లు చేయకూడదు. ఎందుకు అంటే ఇది స్త్రీకి ఎంతో విధారకంగా మరియు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే మీ భార్య సన్నగా మరియు లావుగా ఉంది అని లేక ఆమె ఎత్తు గురించి సరదాగా మాట్లాడడం ఏ స్త్రీకి నచ్చదు. ఇటువంటి విషయాలు గురించి భార్య దగ్గర మాట్లాడొద్దు అని భర్త ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇటువంటి విషయాలే మీ భార్య యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. మీరు ఆమె యొక్క శరీర నిర్మాణం గురించి మాట్లాడినప్పుడు మీ భార్యకు ఆత్మవిశ్వాసం కోల్పోతుంది. అలాగే ఆమె మీకు ఎంతో దూరంగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. అందువల్ల పొరపాటున కూడా మీ భార్యతో ఇలాంటి మాటలు అసలు మాట్లాడకండి…

బంధువు పేరు తీసుకొని అవహేళన చేయడం : మీ భార్యను పొరపాటున కూడా ఆమె కుటుంబంతో మరియు బంధువులతో పోల్చి మాట్లాడకండి. అలాగే భర్తలు తమ భార్యని తన బంధువులతో పోల్చడం కాక ఆమె వారిలాగే ఉంది అని చాలామంది అంటుంటారు. అయితే మీరు ఇలా చేయటం వల్ల భార్య భర్తల మధ్య సంబంధంలో గొడవలు మొదలవుతాయి. అలాగే మీ భార్య కుటుంబంలో ఎవరైనా సరే మీ వైఖరి సరైనది కాదు అని మీరు భావిస్తే, మీరు దానిని మీ భార్య పై రుద్దడం అంత మంచిది కాదు అని గుర్తుంచుకోవాలి. అంతేకాక ఇది సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేయగలదు…

Relationship : భర్త తన భార్యతో ఎప్పుడు చెప్పకుడని మూడు విషయాలు ఏంటో తెలుసా...!!

Relationship : భర్త తన భార్యతో ఎప్పుడు చెప్పకుడని మూడు విషయాలు ఏంటో తెలుసా…!!

తల్లితో పోలిస్తే :  దాదాపుగా ప్రతి భర్త తెలిస్తే లేక తెలియకో తన భార్యను తన తల్లితో పోల్చుతూ ఉంటారు కానీ ఇలా పదేపదే మీరు పోల్చడం వలన మీ భార్య చికాకు మరియు ఇబ్బంది, కోపమనేది వస్తుంది. అయితే ప్రతి విషయంలో వారి తల్లి చెప్పినట్లు వినడం మరియు ఇంటిని నడవడం, పిల్లలను పెంచడం లేక ఆధిపత్యం ఇవ్వడం లాంటివి ఏ భార్యకు అసలు నచ్చదు. అలాగే మీ తల్లి వ్యక్తిత్వం, పరిస్థితులు, అలవాట్లు మరియు మీ భార్య యొక్క వ్యక్తిత్వ, పరిస్థితులు, అలవాట్ల అనేవి చాలా వేరుగా ఉంటాయి. అందువలన మీరు ఇద్దరు వేరువేరు వ్యక్తులను ఒకరితో ఒకరు పోల్చకుండా ఎంతో జాగ్రత్త పడాలి.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి