Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం... ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది...?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం చేస్తూనే ఉన్నాం. భార్యాభర్తల జీవితం కడవరకు నిండు నూరేళ్లు సాగాలి. కానీ ఈ రోజుల్లో అది సాధ్యం కావడం లేదు. అప్పుడు మగవారు తప్పు చేస్తే చులకనగా చూసే సమాజం. ఇప్పుడు ఆడవారు కూడా తెగించి పోతున్నారు. ఆడవారు కూడా చాలా తప్పులు చేస్తున్నారు. భర్త పట్ల ఎంతో ప్రేమాభిమానాలు భక్తి అస్సలు ఉండడం లేదు. వారిని చంపడానికైనా సరే తెగిస్తున్నారు. ఆడవారు ఉన్న సమాజం. చెప్పుకోవాలంటే చాలా సిగ్గుచేటు. అయితే, పెళ్లయిన తర్వాత భర్త మా భార్య తనతో ఎలా నడుచుకుంటుంది అనేది గమనించాల్సి ఉంటుంది. తన ప్రవర్తనలో ఎలాంటి మార్పులు ఉన్న దానిపై శ్రద్ధ పెట్టాలి. ఒక స్త్రీ తన ఇంటిలో మంచి నడవడిక ఉంటే ఆ స్త్రీ పుణ్యస్త్రీ గా చెప్పవచ్చు. సహనం, ఓర్పు, శాంతి ఉంటే ఆ మహిళకు జీవితం బాగుంటుంది. కాలక్రమమైన బంధాలలో మార్పులు వస్తూ ఉన్నాయి. కొన్ని మార్పులు సహజంగా కొన్ని, తీవ్రమైన సంకేతాలను కూడా సూచిస్తున్నాయి. అయితే మీ భార్య మీకు దూరం అవ్వబోతుంది. మీ నుంచి బయట పడాలని ఆలోచిస్తుంది. అనే దానికి ఐదు ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి. ముఖ్యమైన సంకేతాలను, సర్టిఫైడ్ మ్యారేజ్ కొచులు. కటై, టేరీ, మేక్ కేబులు,థెంమెల్కి బిలైఫ్ అనే స్టాగ్రామ్ అకౌంట్లో తెలియజేశారు. సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మీ బంధాన్ని కాపాడుకోవడానికి లేదా భవిష్యత్తు గురించి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

Relationship మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship మీ భార్య వాదించడం మానేస్తుంది

చాలామంది వైవాహిక జీవితంలో బంధంలో సమస్యలు ఏర్పడినప్పుడు దంపతులు ఒకరినొకరు దూషించుకోవడం, నిందించుకోవడం సర్వసాధారణం. అలాంటి వాదనలు ఆరోగ్యకరమైనవి కానప్పటికీ అవి తరచుగా సమస్యలను పరిష్కరించడానికి లేదా కనీసం తమ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి చేసే ప్రయత్నాలుగా ఉంటాయి. అయితే మీ భార్య ఒకేసారి మీతో వాదించడం పూర్తిగా మానేసిందా, చిన్న చిన్న విషయాలపై కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండి పోతుందా, అయితే,ఇది శాంతి కాదు నిర్లిప్తత. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు లేదా ఆమెను బాధ పెట్టినప్పుడు, ఆమె కోపంగా అరవకుండా నిశ్శబ్దంగా ఉంటే అది ప్రమాదకరమైన సంకేతమే. ఎందుకంటే, ఆమె ఇకపై ఆ బంధం కోసం పోరాడడానికి సమస్యలను పరిష్కరించడానికి, లేదా తన భావాలను వ్యక్తం చేయడానికి శక్తిని లేదా ఆసక్తిని కోల్పోతుందని అర్థం. నిశబ్దం,తరచుగా అరుపులు కంటే బిగ్గరైన హెచ్చరిక.ఆమె మీతో భావోద్వేగా పరంగా తెగదింపులు చేసుకోబోతుంది అని సూచించబోతుంది.ఒకప్పుడు పరిష్కరించాలనుకున్న సమస్యలను ఇప్పుడు పట్టించుకోవడంలేదని బంధం పై ఆమెను ఆశలు సన్నగిల్లాయని దీనికి అర్థం.

ఆమె తన పైన దృష్టి పెడుతుంది : ఒక వివాహ జీవితంలో బంధం ఏర్పడిన తరువాత, ఇద్దరు భాగస్వాముల మధ్య ఒకరినొకరు మద్దతుగా నిలుస్తూ, ఇద్దరి కలలను, లక్ష్యాలను పంచుకుంటూ ఉంటారు. మీ భార్యలో మార్పులను ఎప్పుడైనా గమనించారా. ఆమె తన సొంత శాంతికి,ఆనందానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందా. మీతో కలిసి సమయం గడపకుండా ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం గడుపుతుందా. కొత్త అలవాట్లను అలవర్చుకోవడం తన కెరియర్ లేద వ్యక్తిగత ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెట్టడం వంటివి చేస్తుందా. ఆమె మీ ప్రణాళికల్లో మిమ్మల్ని చేర్చుకోకుండా తన సొంత ప్రణాళికను తయారు చేసుకుంటున్న,మిమ్మల్ని పట్టించుకోకుండా తన లోకంలో తాను నిమజ్జనం అయి ఉంటుందా. అది ఒక ముఖ్యమైన సంకేతం. దీని అర్థం ఆమె వివాహంపై కాకుండా తన సొంత భవిష్యత్తుపై తన వ్యక్తిగత అవసరాలపై మాత్రమే దృష్టి పెడుతుందని,ఆమె తన జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని లేదా మీతో సంబంధం లేకుండా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తుందని భావించవచ్చు.ఇది బంధంలో ఆమెకు దూరపు భావన పెరిగిందని సూచిస్తుంది.

భవిష్యత్తు గురించి మాట్లాడటం మానేస్తుంది : ఏ భార్య అయినా సరే బంధంలో భాగస్వాములు ఎప్పుడూ భవిష్యత్తుల గురించి కలలు కంటూ ఉంటారు. సెలవులు, ఇల్లు కొనుగోలు, పిల్లల భవిష్యత్తు, పదవి విమరణ ప్రణాళికలు ఇలా అనేకమైనవి ఉంటాయి. ఈ చర్చిలు బంధం లో ఒక దృక్పథాన్ని భవిష్యత్తుపై నమ్మకాన్ని సూచిస్తుంది. ఆంటీ సమయంలో మీ భార్యతో మీరు భవిష్యత్తు గురించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ఆమె అస్పష్టంగా లేదా చిన్న సమాధానాలు ఇస్తుందా లేదా ఆ చర్చలను పూర్తిగా నివారించే వేరే విషయాల గురించి మాట్లాడుతుందా సెలవులో ప్రణాళికలు దీర్ఘకాలిక లక్ష్యాలు లేదా వీకెండ్ ప్లాన్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఆమెకు లేనప్పుడు కనిపిస్తే అది స్పష్టమైన సంకేతం. మీ భార్య మీతో భవిష్యత్తులో విడిపోవాలని విషయంలో గందరగోళంగా ఉందని లేదా మీకు తెలియకుండానే తన భవిష్యత్తు ప్రణాళికను మార్చుకుంటుందని అర్థం. ఈ సంకేతం ఆమె మీతో పంచుకోవడానికి సంకోచిస్తుందని. ఎందుకంటే, ఆమెకు కచ్చితంగా అయినా సమాధానం తెలియకపోవచ్చు. లేదా సమాధానం మీకు ఇష్టం కూడా ఉండవచ్చు.

రోజువారి విషయాలు మీతో పంచుకోవడం మానేస్తుంది : ఏ భార్య, భర్తల మధ్యన గొడవలైనా, నీటి మీద బుడగలాగా వెంటనే మాయమైపోవాలి. కొందరూ తిట్టుకున్న,కొట్టుకున్న వెంటనే కలిసిపోతారు. కానీ అవి రోజుల తరబడి అలాగే ఉండి ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు ఎక్కువ వారి మధ్య దూరం పెరిగితే అది ఆలోచించాల్సి ఉంటుంది. రోజు జరిగే చిన్న చిన్న విషయాలను తమ ఆనందాలను బాధలను ఆలోచనలను పంచుకుంటారు ఇది భావద్వేగా సానిహిత్యాన్ని పెంచుతుంది మీరు మీ భార్య తన రోజు గురించి తన ఆలోచన గురించి లేదా తన అనుభవాలను గురించి మీకు చెప్పడం మానేసిందని గమనించారా చిన్న చిన్న క్షణాలు మీతో పంచుకోవడం లేదనిపిస్తే ఆమె తన భావద్వేగాలను అనుభవాలను తనలో దాచుకోవడం సురక్షితంగా భావిస్తుంటే అది ఒక ముఖ్యమైన సంకేతం. మీ దగ్గర భావాలను వ్యక్తం చేయడానికి భయపడుతుందని లేదా వాటిని మీరు అర్థం చేసుకోరని భావిస్తుందని సూచిస్తుంది. పెరిగితే మీ మధ్య ఒక అదృశ్యమైన గొడను నిర్మిస్తుంది.

శారీరక స్పర్శ కనుమరుగైపోయింది : శారీరక స్పర్శ అనేది వివాహ బంధంలో అత్యంత కీలకమైన భాగం. కేవలం లైంగిక సంబంధం గురించి కాదు ఇది ప్రేమ ఆప్యాయత సానిహిత్యం బంధం గురించి మీ భార్య శారీరక స్పర్శకు దూరంగా ఉండడం మొదలుపెట్టిందా కౌగిలింతలు లేకపోవడం,ముద్దుల ద్వారా ఇవ్వడం లేదా, అసలు లేకపోవడం లేదా ఆమె చూపుల్లో వెచ్చదనం లేకపోవడం గమనించారా. మీరు పక్కనే కూర్చున్నా కూడా ఆమెకు దూరం పెడుతున్నట్లుగా అనిపిస్తుందా.. మన శరీర భాషలో నెల్లికుతా కనిపిస్తుందా, ఇది మీ మధ్య భావోద్వేగ దూరం పెరిగిందని సూచిస్తుంది. ఒకప్పుడు అపారమైన ప్రేమను అనుబంధాన్ని సూచించిన శారీరక స్పర్శ ఇప్పుడు ఒకరు అయిపోతుంది. అది ఆమె మీకు భావోద్వేగ పరంగా దూరమైపోతుందని స్పష్టమైన సంకేతం. శరీరంతో కూడా మీకు దూరంగా ఉండడం ద్వారా,మీతో తన సంబంధం ప్రయామికున్న ఆసక్తిని సన్నగిల్లిందని తెలుస్తుంది.

మరి మీకు ఏం చేయాలి : నీ సంకేతాలను గమనించినప్పుడు బాధపడటం, భయపడడం సహజమే. అయితే, ఈ సమయంలో మీరు నిగ్రహాన్ని కోల్పోకుండా తెలివిగా వ్యవహరించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు లేదా భావోద్వేగా స్పందనలు పరిస్థితిని మరింత దిగజార్చవద్దు.

ఆమెకు కాస్త సమయం, స్పేస్ ఇవ్వండి : మీ భార్య మీకు దూరం అవుతుందని మీకు అనిపించినట్లయితే, ఆమెను అంటిపెట్టుకొని ఉండడం. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయడం.లేదా ఆప్యాయత కోసం బ్రతిమిలాడడం వంటివి అసలు చేయవద్దు. ఇలా చేస్తే ఆమె మరింత దూరం అయ్యే అవకాశం ఉంది. ఇది ఆమెకు శ్వాస తీసుకోలేని వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి బదులుగా ఆమెకు కొంత స్పేస్ ఇవ్వండి. ఆమె తన ఆలోచనలను భావాలను క్రమబద్ధకరించుకోవడానికి సమయం ఇవ్వండి. వెంట పడకుంటా, ఒత్తిడి చేయకుండా, తన నిర్ణయాలు తాను తీసుకోవడానికి అనుమతించండి. ఇది ఆమెకు మీపై గౌరవాన్ని పెంచుతుంది.బంధాన్ని తిరిగి విశ్లేషించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది.మీ దూరం ఆమెకు మీ విలువలను అర్థమయ్యేలా చేయవచ్చు. ఆమెను ఆమెకు వదిలేయండి. కానీ మీరు ఆమెను అందుబాటులో ఉన్నారని తెలియజేయండి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది