Rusk With Tea : టీ తో పాటు రస్క్ తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rusk With Tea : టీ తో పాటు రస్క్ తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా…!!

Rusk With Tea : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి టీ తాగనిదే రోజు గడవదు. అయితే వేడివేడి టీ తో పాటుగా రస్క్ లను తినడం అనేది భారతదేశంలో ఒక సాధారణ పద్ధతి. అయితే ప్రతిరోజు కూడా ఉదయం టీ తో పాటుగా రస్క్ బిస్కెట్లు తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇకపోతే సాయంత్రం వేళలో కూడా ఇవే స్నాక్స్ తినటానికి ఇష్టపడతారు. అయితే వీటిని చాలా మంది ఆరోగ్యకరమైన స్నాక్స్ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 October 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Rusk With Tea : టీ తో పాటు రస్క్ తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా...!!

Rusk With Tea : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి టీ తాగనిదే రోజు గడవదు. అయితే వేడివేడి టీ తో పాటుగా రస్క్ లను తినడం అనేది భారతదేశంలో ఒక సాధారణ పద్ధతి. అయితే ప్రతిరోజు కూడా ఉదయం టీ తో పాటుగా రస్క్ బిస్కెట్లు తినడానికి చాలామంది ఇష్టపడతారు. ఇకపోతే సాయంత్రం వేళలో కూడా ఇవే స్నాక్స్ తినటానికి ఇష్టపడతారు. అయితే వీటిని చాలా మంది ఆరోగ్యకరమైన స్నాక్స్ అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రస్క్ అనేవి మన ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా.? వీటిని తింటే ఏమవుతుంది.? ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…

ఈ విషయంలో నిపుణుల అభిప్రాయ ప్రకారం చూస్తే, రస్క్ బిస్కెట్లలో ఆరోగ్యానికి హాని కలిగించే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈ రస్క్ బిస్కెట్లు అనేవి స్లో పాయిజన్ లాగా మారి ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. అయితే ఈ విషయం మేరకు డైటీషియన్ రిచా గంగాని ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. ఈ రస్క్ బిస్కెట్లు అనేవి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అని ఆమె తెలిపారు. ఈ రస్క్ బిస్కెట్లు అనేవి ప్రాథమికంగా పిండి మరియు చక్కెర,చౌక నూనెల మిశ్రమం అని ఆమె తెలిపారు. దీనిలో చాలా రకాల ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు షుగర్ ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మరియు శరీర బరువుకు ఎంతో ప్రమాదం. అలాగే వీటిలో గ్లూటేన్ మరియు ఎన్నో రకాల ఆహార పదార్థాలు కూడా కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి. మనకు మార్కెట్లో దొరికే రస్క్ బిస్కెట్లు తరచుగా పాత బ్రేడ్ తో తయారు చేస్తారు. వీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. ఈ రస్క్ బిస్కెట్లను తయారు చేసేందుకు వాడే నూనెలు చాలా చౌకగా ఉంటాయి. ఇవి ఫామ్ ఆయిల్ లాంటి చాలా తక్కువ నాణ్యతను కలిగి ఉంటాయి. ఇవి గుండె సమస్యలకు ఎంతగానో దారి తీస్తాయి.

రస్క్ బిస్కెట్లు ఆరోగ్యానికి ఎందుకు హారికరమైనవి : ఈ రస్క్ లలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ సంకలితాలు జీవక్రియ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ తినడం వలన కొలెస్ట్రాల్ స్థాయిలు అనేవి బాగా పెరుగుతాయి. ఇవి గుండె సమస్యల ప్రమాదాలను కూడా పెంచుతాయి. అలాగే ఎక్కువ మొత్తంలో పిండి మరియు చక్కెరను తీసుకోవడం వలన బరువు పెరగడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యతకు దారి తీస్తాయి. అయితే వీటిని ఒకసారి కాల్చిన తర్వాత అవి పెలుసులుగా మారటానికి మళ్ళీ కాలుస్తారు. ఇలా చేయటం వలన వాటి యొక్క పోషక విలువలను తగ్గిస్తుంది. అలాగే వాటిని ఎక్కువ కేలరీల స్నాక్స్ గా కూడా మారుస్తుంది…

Rusk With Tea టీ తో పాటు రస్క్ తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా

Rusk With Tea : టీ తో పాటు రస్క్ తింటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా…!!

Rusk With Tea ఆరోగ్యకరమైన ఎంపిక ఏమిటి

మీరు టీతో పాటు రస్క్ బిస్కెట్లు తీసుకునే బదులుగా ఆరోగ్యకరమైన ఎంపికలు ఎంచుకోవచ్చు. అలాగే మీరు కాల్చిన మఖాన మరియు కాల్చిన పప్పు లేక గింజలను కూడా తీసుకోవచ్చు. అయితే ఇవి పోషకమైనవి మాత్రమే కాదు బరువును తగ్గించడం లో కూడా హెల్ప్ చేస్తాయి. ఈ స్నాక్స్ అనేది మీ శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు మరియు శక్తిని కూడా ఇస్తాయి. అయితే వీటిని మాత్రం మీరు రస్క్ బిస్కెట్ లా నుండి పొందలేరు. కావున మీరు సాధ్యమైనంత వరకు రస్క్ లాంటి వాటికి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది