Rusk with Tea : టీలో రస్క్ విషంతో సమానంగా.. షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rusk with Tea : టీలో రస్క్ విషంతో సమానంగా.. షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 October 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Rusk with Tea : టీలో రస్క్ విషంతో సమానంగా.. షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు..!

Rusk with Tea  : కొందరికి టీ అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే బెడ్ టీ లేదా కాఫీ తాగనిదే రోజు మొదలవ్వదు. అయితే కేవలం టీ ఒక్కటే అయితే ఎలా అని కొందరు టీలో స్నాక్స్ అంటే బిస్కెట్స్, రస్క్ లు తింటుంటారు. టీలో బిస్కెట్స్ తినడం ఎక్కువగా చేస్తుంటారు. టీ లో రస్క్ లను వేసుకుని తినడం కూడా చాలామంది పాటిస్తుంటారు. ఐతే బిస్కెట్స్ ఐతే ఏమో కానీ రస్క్ లు తినడం అనేది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. టీలో రస్క్ లు తినడం అంటే శరీరంలోకి నెమ్మదిగా విషయాన్ని పంపిస్తున్నట్టే అని అంటున్నారు. టీలో రస్క్ లు అనారోగ్యానికి దారి తీస్తాయని చెబుతున్నారు.

ఈ విషయంపై పోషకాహార నిపుణురాలు రిచా గంగాని తన సోషల్ మీడియా ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. రస్క్ తో ఆరోగ్యానికి ప్రమాదమని ఆమె అన్నారు. పిండి, చక్కెర, చౌక నూనెలు అంటే పామాయిల్ ల మిశ్రమ కాబట్ట్ ఇందులో చాలా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయని ఆమె అన్నారు. ఇది తీసుకోవడంవల్ల అధిక బరువు అవుతారు. గుండె ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. అంతేకాదు ఇందులో గ్లూటెన్ కూడా ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి హానికరమని ఆమె చెప్పారు.

Rusk with Tea  బయట షాపుల్లో దొరికే రస్క్ లు..

ముఖ్యంగా బయట షాపుల్లో దొరికే రస్క్ లు చాలా కాలం స్టాక్ ఉన్న బ్రెడ్ తో తయారు చేస్తారు. ఇది కచ్చితంగా శరీరాన్ని అనారోగ్య బారీన పడేలా చేస్తుంది. వీటి తయారీలో వాడే నూనెలు సైతం చౌకగా ఉంటాయని అందుకే వాటి నాణ్యత ప్రమాదకరమని అన్నారు. రస్క్ లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ వల్ల కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. దాని వల్ల ఎక్కువ అనారోగ్యాలు వస్తాయి. అంతేకాఉ మోతాదుకి మించి చక్కెర, మైదా పిండి కూడా తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదు.

Rusk with Tea టీలో రస్క్ విషంతో సమానంగా షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు

Rusk with Tea : టీలో రస్క్ విషంతో సమానంగా.. షాకింగ్ విషయాలు చెబుతున్న నిపుణులు..!

టీతో రస్క్ ని తీసుకుంటే అది ఎప్పటికీ ఆరోగ్యకరమైన ఆహారం కాదు. టీలో మఖానా, లేదా వేయించిన పప్పులు ఏవైనా తినొచ్చు. ఇవి మంచి పౌష్టికాహారాలు. అంతేకాని స్నాక్స్ గా రస్క్ లు ఎక్కువగా తింటే మాత్రం కచ్చితంగా అవి అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది