Alcohol : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మద్యం తాగితే… శరీరంలో జరిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా…!

 Authored By ramu | The Telugu News | Updated on :1 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Alcohol : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మద్యం తాగితే... శరీరంలో జరిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా...!

Alcohol : ప్రస్తుత కాలంలో ఎంతో మందికి నిత్యం మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అయితే ఈమద్యం వ్యసనం అనేది తొందరగా వదులుకోలేని ఒక దురలవాటు. అయితే కొంత మంది ఇంట్లో ఒంటరిగా తాగటానికి ఇష్టపడితే, మరి కొందరు మాత్రం స్నేహితులతో లేక పార్టీలో మద్యం తాగడానికి ఇష్టపడతారు. అయితే నిత్యం ఆల్కహాల్ తాగే శరీరం అనేది నెమ్మదిగా అనారోగ్య బారిన పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కిడ్నీలు మరియు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే నిజానికి ఆల్కహాల్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. కావున మద్యం తాగటం వలన శరీరంలో షుగర్ లెవెల్స్ అనేవి అకస్మాత్తుగా పెరుగుతాయి…

అయితే అందరి శరీరంలో ఒకే స్పందన ఉంటుంది అని కచ్చితంగా చెప్పలేం. ఈ మద్యం అనేది ప్రతి వ్యక్తి శరీరంలో ఇతర రకాల ప్రతి చర్యలను కలిగిస్తుంది. అయితే ఎక్కువగా తాగడం వలన శరీరంలో చక్కెరను తగ్గించే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లలో ఈ రిస్క్ అనేది చాలా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ వన్ సమస్యతో బాధపడే వారిలో బ్లడ్ షుగర్ అనేది పడిపోతుంది. అలాగే రక్తంలో చక్కెర అనేది ఉన్నట్టుండి హఠాత్తుగా తగ్గడం వలన ఇతర శారీరక సమస్యలను కూడా కలిగిస్తుంది. సాధారణ మద్యం పానీయాలలో కార్బోహైడ్రేట్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కావున బరువు తగ్గటానికి ఎంతో కష్టమవుతుంది…

Alcohol : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మద్యం తాగితే... శరీరంలో జరిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా...!

Alcohol : డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మద్యం తాగితే… శరీరంలో జరిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుసా…!

అలాగే ట్రైగ్లిజరైడ్ స్థాయిలు కూడా పెరుగుతాయి. దీంతో అధిక రక్తపోటు సమస్యలు కూడా కలుగుతాయి. అయితే ఈ ఆల్కహాల్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచనంత వరకు ఎలాంటి హాని ఉండదు. కానీ రక్తంలో చక్కెర అనేది చాలా తక్కువ మోతాదులో ఉంటే అన్నం తినకుండా ఆల్కహాల్ మాత్రమే తీసుకోకూడదు. దీని ఫలితంగా కాలేయం మద్యం ను జీర్ణం చేయటంలో వైఫల్యం చెందే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనాప్పటికి కూడా ఈ డయాబెటిస్ తో బాధపడేవారు మద్యం సేవించే ముందు వైద్యుల సలహా తీసుకోవటం మంచిది…

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి