Palm Oil : పామాయిల్ ను తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా…!
ప్రధానాంశాలు:
Palm Oil : పామాయిల్ ను తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా...!
Palm Oil : మనలో ఎంతో మంది పామాయిల్ ను కూడా వాడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా హోటల్స్ మరియు రెస్టారెంట్ లో పామాయిల్ ను ఎక్కువగా వాడతారు. అయితే ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తాజాగా నిర్వహించినటువంటి అధ్యయనంలో ఈ విషయం తేలింది. అయితే ఈ ఫామాయిల్ ను దీర్ఘకాలంగా తీసుకోవడం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ పామాయిల్ ను తీసుకోవడం వలన మెటాస్టాటి క్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లుగా తేలింది. అయితే బార్సిలో నాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ బయో మెడిసిన్ ఎలుకలపై నిర్వహించినటువంటి పరిశోధనలో పాల్మిటిక్ యాసిడ్ నోటి మరియు చర్మ క్యాన్సర్ లో మెటాస్టాసిస్ ను ప్రోత్సహిస్తుంది అని కనుక్కున్నారు. అయితే ఈ ఫామయిల్ అనేది తాటి చెట్ల పండ్ల నుండి తీసినది. అయితే ప్రస్తుతం ఈ నూనెను ప్యాక్ చేసిన ఆహారాలలో మరియు రెస్టారెంట్ లో అధికంగా ఉపయోగిస్తున్నారు…
నిజం చెప్పాలంటే ఈ ఫామయిల్ అనేది ఇతర నూనెల కంటే చాలా చౌకగా దొరుకుతుంది. అయితే వీటిలో పోషకాలు అనేవి ఉండవు. దీనిలో చాలా సంతృప్తి కొవ్వు అనేది ఉంటుంది. ఈ పామాయిల్ ను నిత్యం ఆహార ప్యాకెట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ప్యాకింగ్ చేసినటువంటి ఆహారంలో ఈ పామాయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీని వలన సంతృప్త కొవ్వు అనేది శరీరంలోకి పోతుంది. ఇది ధమనులను బ్లాక్ చేసేందుకు కారణం అవుతుంది. ఈ ఫామ యిల్ లో చాలా సంతృప్త కొవ్వులు అనేవి ఉంటాయి…
శరీరంలో ఎల్ డిఎల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ కు దారి తీస్తుంది. దీంతో గుండె సమస్యలు నాలుగు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ఫామాయిల్ ను వాడడం వలన శరీరంలో తీవ్రమైన జీవక్రియ సమస్యలను కూడా కలిగిస్తుంది. అలాగే జీర్ణ సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఈ పామాయిల్ ను తీసుకోవటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. దీని వలన మధుమేహం వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ పామాయిల్ లో ఉన్నటువంటి సంతృప్త కొవ్వులు అనేవి క్యాన్సర్ ప్రమాదాలకు కూడా దారి తీస్తుంది. ఇది పెద్ద ప్రేగు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ ను ప్రోత్సహిస్తుంది అని పలు రకాల పరిశోధనలో తేలింది…