Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??
ప్రధానాంశాలు:
Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే... ఈ చిట్కాలను ట్రై చేయండి...??
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా కల్తీయే. పప్పు నుండి ఉప్పు దాకా మరియు బియ్యం నుండి కారం దాకా ఇలా అన్నింటిని కల్తీగా మారుస్తున్నారు కేటుగాళ్లు. అలాగే ప్రజలు ప్రాణాలు ఏమైపోయినా వాళ్లకు సంబంధం లేదు. వాళ్ల జేబులు నిండితే చాలు అని భావిస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. అలాగే గోధుమ పిండిని కూడా కల్తీ చేసి అమ్ముతున్నారు. అలాగే మారిన బిజీ లైఫ్ కారణం చేత ఇన్ స్టాండ్ కోసం ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కిరాణా షాప్ లో దొరికే గోధుమ పిండినే ప్రజలు వాడుతున్నారు. ఈ గోధుమ పిండిలో కూడా కొన్ని రకాల వస్తువులు కలిపి అమ్ముతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ఈ గోధుమ పిండిలో మైదా, మరియు ఇసుకను,చాక్ పీస్ పౌడర్ ను, అదనపు ఊకను, యూరో రూట్ పౌడర్ ఇటువంటి వాటిని కలిపి గోధుమపిండిని కల్తీ చేస్తున్నారు. ఇటువంటి పిండితో చేసిన చపాతీలను తీసుకోవడం వలన ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఊరు పేరు లేని బ్రాండ్ తో పాటుగా లూజ్ గా దొరికే వాటిలో ఎలాంటి కల్తీ ఎక్కువగా జరుగుతుంది అని అంటున్నారు. ఇంతకీ మీరు వాడే గోధుమపిండి మంచిదేనా. ఈ విషయం గురించి తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– గోధుమపిండి యొక్క నాణ్యతను తెలుసుకోవటానికి మనం ముందుగా ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. తర్వాత దానిలో రెండు చెంచాల గోధుమ పిండిని వేయాలి. ఆ తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి. తర్వాత ఆ గోధుమ పిండి అనేది పైకి తేలినట్టు అనిపిస్తే అది నకిలీ గోధుమపిండి అని అర్థం. ఒకవేళ ఆ పిండి నీటి అడుగుకు చేరుకుంటే అది మంచిది అని అర్థం..
– సాధారణంగా మనం చపాతీలు చేసుకునేటప్పుడు పిండిని కలుపుకుంటాం. అయితే ఈ పిండి తయారు చేసేందుకు ఎక్కువ నీరు అవసరమైనా మరియు తొందరగా పిండి అనేది మెత్తగా కాకపోయినా అది కల్తీ పిండి అని అర్థం చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు.
– ఇకపోతే గోధుమ పిండి నాణ్యతను నిమ్మకాయతో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో మూడు లేఖ నాలుగు చుక్కలు నిమ్మరసం పిండాలి. ఒకవేళ ఆ పిండిలో బుడగలు గనుక వస్తే అది కల్తీ అని అర్థం చేసుకోవాలి. కానీ దానిలో ఎటువంటి మార్పులు కనిపించకపోతే ఆ పిండి స్వచ్ఛమైనది అని అర్థం. సాధారణంగా ఈ పిండిలో చాక్ పౌడర్ ఉంటేనే బుడగలు వస్తాయి . Simple techniques to find adulterated wheat flour