Wheat Flour : మీరు వాడే గోధుమపిండి నకిలీదా.? అసలైనదా? ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు..!
Wheat Flour : ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనం తింటున్న పదార్థాలలో ఏది నకిలీ ఏది అసలైనది మనం తేల్చుకోలేకపోతున్నా. 90% వరకు నకిలీనే వాడుతూ ఉన్నాం. అది మనకి తెలియదు.. పిల్లలు తాగే పాలు మొదలు నుంచి ప్రతి ఒక్కటి కూడా అంతా కల్తీ అవుతున్నాయి. ఇటువంటి కల్తీ పదార్థాల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అనారోగ్యం బారిన పడుతున్నారు. దాని ఫలితంగా ఎంతో ఖర్చు చేసి ఆసుపత్రులు చుట్టూ తిరగవలసి వస్తుంది. అయితే కలితీ పదార్థాలలో ఒకటి గోధుమపిండి చాలామంది ఆరోగ్యం కోసం ఒక పూట అన్నం తినడం మానేసి గోధుమ పిండితో చపాతీలు చేసుకుని తింటూ ఉన్నారు. అయితే కేటుగాళ్లు దీన్ని కూడా కల్తీ చేసేస్తున్నారు.
అది గుర్తించలేక చాలామంది అలాగే తింటున్నారు. అనారోగ్య బారిన పడుతున్నారు. మరి ఈ పిండిలో కల్తీ ఎలా తెలుసుకోవాలి. మీరు తీసుకునే గోధుమపిండి నిజమైనదా దానిలో కలితీ జరుగుతుందా అని తెలుసుకోవడం ఎలా.? అయితే దీనికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అసలైన గోధుమపిండి నకిలీ గోధుమపిండికి నడుమ తేడా అని కనుక్కోవడం ఏ విధంగానో ఇప్పుడు మనం చూద్దాం… గోధుమపిండి నకిలీని ఈ విధంగా గుర్తించండి…చపాతీని తయారు చేసేటప్పుడు కూడా గోధుమపిండి స్వచ్ఛతను కనుక్కోవచ్చు. సహజంగా గోధుమపిండిని కలపడానికి తక్కువ నీళ్లు అవసరం పడుతూ ఉంటాయి. అయితే అది చాలా మెత్తగా ఉంటుంది. స్వచ్ఛమైన పిండితో చేసిన రోటీలు ఈజీగా సాగిపోతూ ఉంటాయి.
ఇటువంటి లక్షణాలున్న పిండిని స్వచ్ఛమైనదిగా నమ్మవచ్చు. అదే కల్తీ పిండి అయితే దానిని కలిపేటప్పుడు ఎక్కువగా నీరు అవసరం పడుతుంటాయి. పిండి గట్టిగా అవుతూ ఉంటుంది. చపాతీలు కూడా చాలా చిన్నవిగా అనిపిస్తూ ఉంటాయి. నీటిలో కూడా గోధుమపిండి కల్తీని కనిపెట్టేయొచ్చు. దీనికోసం ముందుగా ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి. దానిలో అరచెంచా పిండిని వేయాలి. ఆ తదుపరి దానిని బాగా కలపాలి. 10 సెకండ్ల పాటు అలాగే ఉంచాలి. కాసేపు ఆ పిండిని బాగా గమనిస్తూ ఉండాలి. పిండి నీటిలో తేలుతూ అనిపిస్తే ఆ పిండి కలిపి అని నమ్మవచ్చు. పిండి అడుగున వెళ్లి ఉంటే అది స్వచ్ఛమైందని తెలుసుకోవచ్చు…