Wheat Flour : గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
Wheat Flour : గోధుమ పిండి తెలుసు కదా. అన్నంతో పాటు ఎక్కువగా మనం రోజూ తినేది గోధుమ పిండినే. అన్నం పడని వాళ్లు ఎక్కువగా గోధుమ పిండితో చేసే చపాతీలను తింటారు. చపాతీలంటే ఇష్టం ఉండని వాళ్లు ఎవ్వరూ ఉండరు. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్లు.. ఎక్కువగా చపాతీలు తినడానికే ఇష్టపడుతుంటారు. ఏది ఏమైనా.. గోధుమ పిండితో చేసే వంటకాలంటే అందరికీ ఇష్టమే. కానీ.. గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే ఏమౌతుందో చాలామందికి తెలియదు. గోధుమ పిండి ఆరోగ్యానికి మంచిదే కదా. ఎంత తిన్నా ఏమౌతుంది.. అని అనుకుంటున్నారేమో. అసలు.. గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే నష్టాలే తప్పితే లాభాలు లేవు.
ఎందుకంటే.. గోధుమ పిండిలో గ్లూటెన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరంలో ఎక్కువైతే సమస్యలే. నిజానికి గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని అందరూ తింటారు. కానీ.. అది ఇదివరకు మాట. కానీ.. ఇప్పుడు అంతా గోధుమ పిండిలో ఫైబర్ తక్కువగా… గ్లూటెన్ ఎక్కువగా ఉంటోంది. దానికి కారణం.. గోధుమ పిండిని ఫ్యూరిఫై పేరుతో రిఫైన్ చేయడమే. దాని వల్ల.. అందులో ఉన్న ఫైబర్ తగ్గిపోతుంది. గ్లూటెన్ శాతం పెరుగుతుంది. అటువంటి గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే.. సీలియాక్ అనే వ్యాధి వస్తుంది.
Wheat Flour : గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్యలు ఇవే
గోధుమ పిండిని ఎక్కువగా తీసుకుంటే.. కడుపు నొప్పి వస్తుంది. పేగులు బిగుసుకుపోతాయి. నీళ్లతో కూడిన విరేచనాలు అవుతాయి. గ్యాస్ సమస్య వస్తుంది. పేగుల్లో వాపు వస్తుంది. చిన్న పేగు క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. గోధుమ పిండితో చేసిన తీపి పదార్థాలు తిన్నా కూడా ఇటువంటి సమస్యలే వస్తాయి. నోటి పూత వస్తుంది. విటమిన్ కే లోపం వస్తుంది. దాని వల్ల అధిక రక్తస్రావం అవుతుంది. ఐరన్ లోపం ఏర్పడుతుంది.
మహిళల్లో కూడా గోధుమ పిండిని అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. మహిళల్లో గర్భస్రావం కావడం, నెలసరి సమయంలో ఎక్కువ రక్తం పోవడం, సరిగ్గా నెలసరి రాకపోవడం లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి.
ఇది కూడా చదవండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!
ఇది కూడా చదవండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> పెరుగును తెగ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు?