Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  Strawberry : స్ట్రాబెరీనా మజాకా... దీని ప్రయోజనాలు తెలిస్తే... వదలనే వదలరు..?

Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు. ఈ పండు చిన్నది. కానీ దీని ప్రయోజనాలు బోలెడు. ఈ స్ట్రాబెరీ పండు చూడడానికి ఎరుపు రంగులో చూడగానే నోరూరించే విధంగా ఉంటుంది. ఈ స్ట్రాబెరీ మనదేశంలో ప్రధానంగా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్,మహారాష్ట్రలలో కొన్ని ప్రాంతాలలో సాగు చేస్తున్నారు. స్ట్రాబెరీ లో విటమిన్ సి, ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా ముఖ్యంగా, స్ట్రాబెరీ కొలెస్ట్రాలను అదుపులో ఉంచగలదు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించగలదు. ఇంకా రక్తపోటులను నియంత్రించగలదు. దీనిలో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట చేత,కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహకరిస్తుంది. ఇది కంటి శుక్లాం, ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలదు.

Strawberry : స్ట్రాబెరీనా మజాకా... దీని ప్రయోజనాలు తెలిస్తే... వదలనే వదలరు..?

Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

Strawberry స్ట్రాబెరీ తో ఆరోగ్య ప్రయోజనాలు

స్ట్రాబెరీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.తద్వారా,జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.మలబద్ధకం వంటి సమస్యలు నివారించబడతాయి.ఇది కడుపునీ తేలిక పరుస్తుంది.జీర్ణ క్రియను సరిగ్గా జరిగేలా చేస్తుంది. స్ట్రాబెరీలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.బరువు తగ్గడానికి ఇది సులభమైన ఆ మార్గం. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి ఉంటుంది.అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది. స్ట్రాబెరీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఎలాజిక్ ఆమ్లం చర్మ కణాలను ప్రియురాలికల్స్ నుంచి రక్షించగలదు. ఇది చర్మ ముడతలను తగ్గించడంలోనూ, ఇంకా ముఖంపై మచ్చలను తగ్గించడానికి,చర్మం కాంతివంతంగా మెరవడానికి, చర్మచాయను మెరుగుపరచడానికి ఎంతో సహకరిస్తుంది. స్ట్రాబెరీ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది వ్యాధులతో పోరాడే శక్తి కూడా కలిగి ఉంటుంది. జలుబు, దగ్గు వంటి ఇతర కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నుంచి రక్షించగలదు. స్ట్రాబెరీలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇవి కొలెస్ట్రాలను అదుపు చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్త పోటును నివారిస్తుంది.ఇందులో ఉండే విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి శుక్లాం ఇతర కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి స్ట్రాబెరీ బెస్ట్ ఆప్షన్. తక్కువ గ్లైసిమిక్ సూచికను కలిగి ఉంటుంది రక్తంలో చక్కర స్థాయిని నియంత్రిస్తుంది తద్వారా డయాబెటి స్ నివారించబడుతుంది. షుగర్ రోగులకు సురక్షితమైన పండు. ఆరోగ్యకరమైన పండు. ఎలాజిక్ ఆమ్లం,ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా నిరోధించే శక్తి ఉంది.శరీరాన్ని నిర్వికరణ చేయగలదు.వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి