Sugarcane Juice : వేసవిలో చెరకు రసం తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ప్రధానాంశాలు:
Sugarcane Juice : వేసవిలో చెరకు రసం తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Sugarcane Juice : ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకి జనాలు అల్లల్లాడిపోతున్నారు. బయటకి వెళితే నోరెండిపోతుంది. మంచి నీళ్లు తాగుతున్నా కూడా దాహం తీరడం లేదు. అయితే ఎండాకాలంలో చెరకు రసం ఉత్తమ ఎంపికగా పరిగణించబడుతుంది. వాస్తవానికి, చెరకు రసం కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం , భాస్వరం యొక్క మంచి మూలంగా చెప్పుకోవచ్చు. అందుకే చెరకు రసం వేడిలో ఉత్తమ రసంగా చెబుతారు. ఈ జ్యూస్ మీ దాహాన్ని తీరుస్తుంది, అలాగే ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. చెరకు రసం సహజంగా తియ్యగా ఉంటుంది. ఒక ప్రత్యేకమైన తాజా వాసన కలిగి ఉంటుంది.రంగు తెల్లటి నుంచి లేత గోధుమ రంగు వరకు ఉంటుంది. చెరుకు రకం తయారీ విధానం బట్టి రంగు మారుతుంది.
Sugarcane Juice : చెరకు వలన చాలా ఉపయోగాలు..
చెరుకు రసం త్రాగడానికి ఉత్తమ సమయం ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. లేదంటే భోజనం చేయడం కంటే ముందే తాగితే మంచిది. ఎందుకంటే భోజనం తర్వాత చెరుకు రసం తాగడం వల్ల ఆహారంలో ఇతర కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇందులో విటమిన్ B1, B2, B6, C, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇందులో చక్కెరలు శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి.ఇందులోని పొటాషియం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇందులోని విటమిన్ C రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.చెరకు రసం ఆకలిని అణచివేయడానికి అధికంగా తినడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఇందులో ఫినాలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండటం వల్ల అకాల వృద్ధాప్యాన్ని నిరోధించడంతోపాటు.. చర్మంపై ముడతలు లేకుండా చేస్తుంది.

Sugarcane Juice : వేసవిలో చెరకు రసం తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఆయుర్వేద వైద్యం ప్రకారం.. చెరకు రసం ఒక దివ్య ఔషదంగా చెబుతారు. బరువు తగ్గడంలో చెరకు రసం కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, దీని వల్ల మీకు ఇంకేమీ తినాలని అనిపించదు. చెరకు రసం చాలా తియ్యగా ఉంటుంది కాబట్టి, మధుమేహం ఉన్నవారు దీనిని తక్కువ మొత్తంలో మాత్రమే తాగాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కామెర్లు వంటి వ్యాధులను తొలగించడంలో చెరకు రసం సహాయపడుతుంది.చెరకు రసంను ముక్కలుగా కోసి తాజాగా తినవచ్చు. లేదంటే జ్యూస్ గా చేసి తాగవచ్చు.