Liver Cancer : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల వ్యాధులు మనల్ని వెంటాడుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసినదే. అయితే వాటిలలో క్యాన్సర్ కూడా ఒకటి. అయితే క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు మనకు కనిపిస్తాయి. వీటిని గనక మీరు ముందుగానే గమనిస్తే క్యాన్సర్ మొదటి దశలో ఉన్నప్పుడే నివారించవచ్చు. అలాగే మన శరీరంలో ముఖ్యమైన అవయవాలలో కాలేయం కూడా ఒకటి. ఈ మధ్యకాలంలో అధికంగా లివర్ క్యాన్సర్ తో చాలా మంది మరణిస్తున్నారు అనే సంగతి తెలిసినదే. అలాగే లివర్ కి క్యాన్సర్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. మరి అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
లివర్ కు క్యాన్సర్ వచ్చే ముందు మొదటగా కనిపించే లక్షణాలలో కడుపునొప్పి ఒకటి. అలాగే కుడివైపు అధికంగా ఎప్పుడు లేనంతగా అసౌకర్యవంతంగా ఉంటూ నొప్పిగా ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. అలాగే లివర్ కి క్యాన్సర్ వచ్చే ముందు కామెర్లు కూడా వస్తాయి. అంతేకాక కళ్ళు మరియు చర్మం, గోర్ల రంగు పసుపు పచ్చ కలర్ లోకి మారతాయి.
మీకు కామెర్లు వచ్చినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. అంతేకాక హఠాత్తుగా బరువు తగ్గడం కూడా లివర్ క్యాన్సర్ కు కారణం అవుతుంది. అలాగే అలసట మరియు వాంతులు, వికారంగా ఉన్నా కూడా లివర్ క్యాన్సర్ కు కారణం అవ్వచ్చు. ఇకపోతే మీ మూత్రం కూడా ముదురు రంగులో వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి టెస్టులు చేయించుకోండి.
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
Pumpkin Seeds : గుమ్మడి గింజలు అనేవి చూడటానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి. కానీ వీటిని ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో…
Tulasi Vivaham : హిందూమతంలో తులసి శ్రీ మహావిష్ణువు రూపమైన శాలి గ్రాముల వివాహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక…
Work From Home Jobs : ఇంట్లో ఇద్దరు జాబ్ చేస్తేనే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంది. ఎంత…
Telangana : తెలంగాణలో నిరుద్యోగ యువత పెరిగింది. నిరుద్యోగంలో దేశంలో రాష్ట్రం ముందుంది. రాష్ట్రంలోని 15 నుండి 29 సంవత్సరాల…
Nagula Chavithi : కార్తీక మాసంలో శుద్ధ శుక్ల పక్ష చవితి రోజున నాగుల చవితిని జరుపుకుంటారు. ఈ ఏడాది…
This website uses cookies.