Bathing In Winter : చలికాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే మారినటువంటి వాతావరణంలో ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు. అయితే మనం మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఒకటి స్నానం చేసే విషయంలో చేసే తప్పులు. అయితే మనం సాధారణంగా చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటాం. అయితే అధిక వేడి ఉన్న వాటర్ తో స్నానం చేయడం వలన చర్మం అనేది పొడిబారుతుంది అని అంటున్నారు నిపుణులు. దీని వలన చర్మం పగలడం లాంటి సమస్యలు వచ్చి పడతాయి అని అంటున్నారు. అందుకే గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి అని అంటున్నారు. ఇకపోతే చలికాలంలో తరచుగా తలస్నానం చేయడం వలన కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చి పడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే నెత్తిపై ఉండే మాడ పొడిబారడం వలన చుండ్రు సమస్య అనేది వస్తుంది. అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపులను వాడడం వలన కూడా చుండ్రు సమస్య వస్తుంది. కావున వేడి నీటితో తల స్నానం చేయకూడదు అని అంటున్నారు నిపుణులు.
ఇకపోతే ముఖానికి సబ్బులను కూడా వాడొద్దు అని అంటున్నారు. అయితే సబ్బు లకు బదులుగా శనగ పిండిని చర్మానికి అప్లై చేసుకోవడం వలన చర్మం ఆరోగ్యం అనేది పదిలంగా ఉంటుంది అని అంటున్నారు. ఇకపోతే చలికాలంలో చెయ్యని మరొక తప్పు ఏమిటి అంటే టవల్ ను ఉతక్కుండా ఎక్కువ రోజులు వాడడం. అలాగే ఈ టవల్స్ ను ఎక్కువ రోజులు ఉతకకపోతే టవల్స్ లో ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టవల్స్ ను ఉపయోగించడం వలన చర్మ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. అందుకే తప్పనిసరిగా నిత్యం టవల్ ను ఉతకాలి అని అంటున్నారు. అలాగే ఉతికినటువంటి టవల్ ను ఎండలో బాగా ఆరబెట్టాలి అని అంటున్నారు.
అంతేకాక తేమగా ఉన్నటువంటి టవల్ ను అస్సలు వాడొద్దు అని అంటున్నారు నిపుణులు. అలాగే ఈ సీజన్ లో కాటన్ టవల్స్ ను మాత్రమే వాడాలి. ఇవైతే శరీరంపై ఉన్న నీటిని పీల్చుకుంటాయి. ఇకపోతే స్నానం చేసేటప్పుడు మనం వాడే స్కబ్బర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్క్రబ్బర్ ను ఉపయోగించిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేయకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అని అంటున్నార నిపుణులు
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 13వ వారం రెండు ఎలిమినేషన్స్ జరిగాయి.…
TTD : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక నివాసితులకు డిసెంబర్ 3 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించనున్నట్లు ప్రకటించింది.…
Hair Growth Oil : ప్రస్తుత కాలంలో ఆడ మరియు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే…
Ysrcp : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుంది. ఐతే వైసీపీ కూటమి పాలనను టార్గెట్ చేస్తూ ఎన్నో రకాలుగా…
Carrot Juice : చలికాలంలో ఎక్కువగా ప్రజలు జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే శరీరం కూడా…
Turmeric And Ginger : పసుపు మరియు అల్లం ఈ రెండిటికి కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది అని ప్రత్యేకంగా…
Gold Rate : పండగ, పెళ్లి, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా ఆభరణాల కోసం బంగారం కావాల్సిందే. అందుకే రోజు…
Banana Flower : అరటి పండ్లు మాత్రమే కాదు అరటి పువ్వు కూడా మన ఆరోగ్యానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది.…
This website uses cookies.