Bathing In Winter : చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bathing In Winter : చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :1 December 2024,1:30 pm

ప్రధానాంశాలు:

  •  Bathing In Winter : చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా...!!

Bathing In Winter : చలికాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అలాగే మారినటువంటి వాతావరణంలో ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు. అయితే మనం మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులను చేస్తూ ఉంటాం. అలాంటి వాటిలో ఒకటి స్నానం చేసే విషయంలో చేసే తప్పులు. అయితే మనం సాధారణంగా చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటాం. అయితే అధిక వేడి ఉన్న వాటర్ తో స్నానం చేయడం వలన చర్మం అనేది పొడిబారుతుంది అని అంటున్నారు నిపుణులు. దీని వలన చర్మం పగలడం లాంటి సమస్యలు వచ్చి పడతాయి అని అంటున్నారు. అందుకే గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి అని అంటున్నారు. ఇకపోతే చలికాలంలో తరచుగా తలస్నానం చేయడం వలన కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చి పడతాయి. ముఖ్యంగా చెప్పాలంటే నెత్తిపై ఉండే మాడ పొడిబారడం వలన చుండ్రు సమస్య అనేది వస్తుంది. అలాగే కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపులను వాడడం వలన కూడా చుండ్రు సమస్య వస్తుంది. కావున వేడి నీటితో తల స్నానం చేయకూడదు అని అంటున్నారు నిపుణులు.

Bathing In Winter చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా

Bathing In Winter : చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో తెలుసా…!!

ఇకపోతే ముఖానికి సబ్బులను కూడా వాడొద్దు అని అంటున్నారు. అయితే సబ్బు లకు బదులుగా శనగ పిండిని చర్మానికి అప్లై చేసుకోవడం వలన చర్మం ఆరోగ్యం అనేది పదిలంగా ఉంటుంది అని అంటున్నారు. ఇకపోతే చలికాలంలో చెయ్యని మరొక తప్పు ఏమిటి అంటే టవల్ ను ఉతక్కుండా ఎక్కువ రోజులు వాడడం. అలాగే ఈ టవల్స్ ను ఎక్కువ రోజులు ఉతకకపోతే టవల్స్ లో ఫంగస్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టవల్స్ ను ఉపయోగించడం వలన చర్మ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు నిపుణులు. అందుకే తప్పనిసరిగా నిత్యం టవల్ ను ఉతకాలి అని అంటున్నారు. అలాగే ఉతికినటువంటి టవల్ ను ఎండలో బాగా ఆరబెట్టాలి అని అంటున్నారు.

అంతేకాక తేమగా ఉన్నటువంటి టవల్ ను అస్సలు వాడొద్దు అని అంటున్నారు నిపుణులు. అలాగే ఈ సీజన్ లో కాటన్ టవల్స్ ను మాత్రమే వాడాలి. ఇవైతే శరీరంపై ఉన్న నీటిని పీల్చుకుంటాయి. ఇకపోతే స్నానం చేసేటప్పుడు మనం వాడే స్కబ్బర్స్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ స్క్రబ్బర్ ను ఉపయోగించిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేయకపోతే వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అని అంటున్నార నిపుణులు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది