మలబద్ధక సమస్యతో బాధపడేవారు… మజ్జిగలో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే చాలు…!
ప్రధానాంశాలు:
మలబద్ధక సమస్యతో బాధపడేవారు... మజ్జిగలో ఈ రెండిటిని కలిపి తీసుకుంటే చాలు...!
ప్రస్తుత కాలంలో మలబద్ధకం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది అని చెప్పొచ్చు. దీనికి కారణం మనం తీసుకుంటున్న ఆహారంలో మార్పులు మరియు మన జీవన విధానం కారణం చేత మలబద్దక సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి బాగా పెరిగిపోతుంది. అయితే దీర్ఘకాలంగా ఈ సమస్యతో మీరు బాధపడుతుంటే, అది ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాలలో ఈ మలబద్ధక సమస్య అనేది క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలకు కూడా దారి తీస్తుంది అని అంటున్నారు. అందుకే మీరు ఈ సమస్యలను అస్సలు లైట్ తీసుకోకూడదు అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ మలబద్దక సమస్యను ప్రారంభ దశలోనే చెక్ పెట్టాలని అంటున్నారు నిపుణులు. అయితే వైద్యులను సంప్రదించే కంటే ముందు మీరు కొన్ని రకాల నేచురల్ చిట్కాలతో ఈ సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు…
అయితే సాధారణంగా మలబద్ధక సమస్య ఉన్నవారు ఎక్కువగా మజ్జిగను తాగాలి అని వైద్యులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అయితే ఈ మజ్జిగలో కొన్ని రకాల పదార్థాలను కలుపుకోవడం వలన అధిక ఫలితాలు ఉంటాయి అని అంటున్నారు నిపుణులు. అలాగే మీకు మలబద్ధక సమస్య అనేది ఉన్నట్లయితే అది తర్వాత ఫైల్ సమస్యకు కూడా దారి తీస్తుంది. అయితే ఈ మజ్జిగలో జీలకర్రతో పాటుగా కొత్తిమీరను వేసుకొని తాగడం వలన ఫలితం మెరుగ్గా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు…
అయితే మీరు ప్రతిరోజు కచ్చితంగా రెండు గ్లాస్ ల మజ్జిగను తీసుకున్నట్లయితే మలబద్ధక సమస్యతో పాటుగా జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి అని అంటున్నారు నిపుణులు. అయితే మలబద్దక సమస్య న ఉంటే దాని నుండి బయటపడాలి అంటే మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చెప్పాలంటే మీరు తీసుకునే ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అని అంటున్నారు. మీరు ఇలా చేయటం వలన మలబద్ధక సమస్యతో పాటుగా జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి అని అంటున్నారు నిపుణులు…