Tea : ప్రతిరోజు ఉదయాన్నే ఈ టీ ని తాగండి… డయాబెటిస్ కి బైబై చెప్పండి…!
ప్రధానాంశాలు:
Tea : ప్రతిరోజు ఉదయాన్నే ఈ టీ ని తాగండి... డయాబెటిస్ కి బైబై చెప్పండి...!
Tea : ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల సమస్యలతో మనం బాధపడుతున్నాం. అయితే ఈ సమస్యలలో డయాబెటిస్ కూడా ఒకటి. ఈ డయాబెటిస్ అనేది ఒకసారి వచ్చింది అంటే చాలు జీవితాంతం బాధపడాల్సిందే. ఈ డయాబెటిస్ అనేది వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం తప్పితే దీనికి మెడిసిడ్ కూడా లేవు. ఈ డయాబెటిస్ తో బాధపడేవారు మన భారత దేశంలోనే ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మారిన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన ఈ డయాబెటిస్ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు.
ఈ సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కంటే ఈ సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. తాజా అధ్యయన ప్రకారం చూస్తే ప్రతిరోజు బ్లాక్ టీనే తాగే వారిలో డయాబెటిస్ తగ్గుతున్నట్లుగా పరిశోధనలో తేలింది. అయితే ఈ బ్లాక్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ అనేవి సమృద్ధిగా ఉన్నాయి. అంతేకాక పొట్ట ఆరోగ్యాన్ని రక్షించే పోషకాలు కూడా మెండుగా ఉన్నాయి. వాటి వలన మధుమేహం వచ్చే అవకాశాలు 50% తగ్గినట్లు గుర్తించారు. కావున ప్రతినిత్యం ఉదయాన్నే బ్లాక్ టీ తాగితే చాలా మంచిది. ఈ బ్లాక్ టీ తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
బ్లాక్ టీతో అమేజింగ్ బెనిఫిట్స్ : ఈ తాజా అధ్యయనాన్ని దాదాపుగా లక్షల మంది పెద్దవాళ్లపై నిర్వహించారు. వీరికి ఎన్నో రకాల టీలను ఇచ్చారు.ఆ టీ లు వారిపై ఎలాంటి ప్రభావాలను చూపిస్తున్నాయో పరిశీలించారు. ఈ తరుణంలో రక్తంలో చక్కర స్థాయిలు అనేవి పెరగడం లాంటి వాటిని కనుక్కున్నారు. అయితే మిగతా టీలతో పోల్చినట్టయితే బ్లాక్ టీ ని తీసుకునేవారిలో షుగర్ వచ్చే అవకాశం తగ్గినట్లుగా కనుక్కున్నారు. దీనిని బట్టి మధుమేహాని కి చెక్ పెట్టే లక్షణం ఈ బ్లాక్ టీ కి ఉన్నట్లుగా కనుక్కున్నారు.
Tea గ్రీన్ టీ తో కూడా డయాబెటిస్ కంట్రోల్
కేవలం బ్లాక్ టీతో మాత్రమే కాదు గ్రీన్ టీ తో కూడా డయాబెటిస్ కు చెక్ పెట్టవచ్చు అని కనుక్కున్నారు. అయితే ఇంకొక అధ్యాయనంలో పది లక్షల మందికి పైగా పరిశోధనలు జరిపారు. అయితే వీరికి కొన్ని సంవత్సరాల పాటు గ్రీన్ టీ తాగమని చెప్పారు. అయితే ఈ పరిశోధనాలో టైప్ టు డయాబెటిస్ బారిన పడే అవకాశం 17 శాతం వరకు తగ్గినట్లుగా కనుక్కున్నారు. కావున గ్రీన్ టీ కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచేందుకు సహాయపడుతుంది అని తేలింది. అయితే షుగర్ అనేది రాకుండా ఉండాలి అంటే మైదాతో చేసే ఆహారాలకు చాలా దూరంగా ఉండాలి. అలాగే వ్యాయామం చేయటం మరియు ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు మరియు పండ్లు లాంటి వాటిని తీసుకోవటం వలన మధుమేహానికి దూరంగా ఉండవచ్చు అని అంటున్నారు…