Diabetes – Blood Pressure : ఖాళీ కడుపుతో ఈ ఆకులను తీసుకుంటే మధుమేహం రక్తపోటు దరిచేరవు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes – Blood Pressure : ఖాళీ కడుపుతో ఈ ఆకులను తీసుకుంటే మధుమేహం రక్తపోటు దరిచేరవు…!!

Diabetes – Blood Pressure : ఈరోజుల్లో చాలామంది డయాబెటిస్ షుగర్ అలాగే హై బీపీతో బాధపడుతున్నారు.. చాలామంది ఎన్ని మందులు వాడినా అసలు తగ్గడం లేదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎవరికీ సరైన అవగాహన ఉండదు. అయితే మీకోసం ఈరోజు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను.. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతోఈ నాలుగు ఆకులు తింటే మీ షుగర్ లెవెల్ అలాగే బీపీ లెవెల్ అదుపులో ఉంటాయి. దీనికంటే సులువైన మార్గం ఇంకోటి ఉండదు. ఆసుపత్రిలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 August 2023,8:00 am

Diabetes – Blood Pressure : ఈరోజుల్లో చాలామంది డయాబెటిస్ షుగర్ అలాగే హై బీపీతో బాధపడుతున్నారు.. చాలామంది ఎన్ని మందులు వాడినా అసలు తగ్గడం లేదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఎవరికీ సరైన అవగాహన ఉండదు. అయితే మీకోసం ఈరోజు కొన్ని చిట్కాలు చెప్పబోతున్నాను.. మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతోఈ నాలుగు ఆకులు తింటే మీ షుగర్ లెవెల్ అలాగే బీపీ లెవెల్ అదుపులో ఉంటాయి. దీనికంటే సులువైన మార్గం ఇంకోటి ఉండదు. ఆసుపత్రిలో బిల్లుల నుంచి విముక్తి పొందాలంటే రోగాల భారం నుంచి విముక్తి పొందాలంటే ఇంతకంటే మంచి మార్గం మరొకటి లేదు. మీరు ప్రపంచం చుట్టి వచ్చిన ఎవరి దగ్గరకు వెళ్లిన ఏదైనా ప్లాన్ ఫాలో అయిన నేను చెప్పే మాత్రం తప్పకుండా ముందు పాటించండి.

అయితే ఈ ప్రధానమైన నాలుగు రకాల ఆకులని మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే గనక ఇక రోగాలు మీ దగ్గరికి రావు.. మొదటిది తులసి ఆకులు తులసిని మూలికల రాణి అని పిలుస్తారు. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. బయలాజికల్ ప్రాపర్టీస్ తో సమృద్ధిగా నిండు ఉంటుంది. తులసి ఆకుల్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అదే విధంగా ఇంకొక అద్భుతమైన ఆకు కరివేపాకు. ఇది భారతీయ వంటల్లో ఉపయోగించే ఒక సాధారణ పదార్థం. ఈ ఆకులు జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. కరివేపాకుల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ తయారు చేసే కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

Today many suffer from diabetes sugar as well as high BP

Today many suffer from diabetes sugar as well as high BP

అలాగే ఈ కణాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మరొకటి వేప ఆకు; వేపాకుల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. రోజు వేపాకుల్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీ రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా మానిటర్ చేసుకోండి. కొన్ని అరుదైన సందర్భాల్లో మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోతూ ఉంటుంది.ఇక వేపాకులు ఒక ఐదు, కరివేపాకు ఒక ఐదు ఆకులు, అలాగే తులసి ఆకులు ఐదు ఈ మూడింటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు చాలా వ్యాధుల భారం నుంచి రక్షించబడతారు. ఇవి హానికరమైన బ్యాక్టీరియా నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తారు. చెప్పినట్టుగా రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది