GBS Virus : ఏంట్రా బాబు ఈ వైరస్ల బాధ..మరో కొత్త వైరస్.. ఈ వ్యాధి లక్షణాలు ..ఇది ఎలా వస్తుంది…?
ప్రధానాంశాలు:
GBS Virus : ఏంట్రా బాబు ఈ వైరస్ల బాధ..మరో కొత్త వైరస్.. ఈ వ్యాధి లక్షణాలు..ఇది ఎలా వస్తుంది...?
GBS Virus : ప్రపంచవ్యాప్తంగా కొత్త కొత్త వైరస్ లు వచ్చి ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ పోయిన తర్వాత కొత్త వైరస్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని ఉనికిస్తున్న మరో కొత్త వైరస్… (GBS )బులియన్ బారే సిండ్రోమ్ ఇప్పుడు కలకలం రేపుతుంది. మన హైదరాబాదులో తొలి కేసు నమోదయింది. సిద్దిపేటకు చెందిన మహిళకు GBS పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు. ప్రస్తుతము ఆ పేషంటు హైదరాబాదులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేషన్ పై చికిత్స తీసుకుంటుంది. అసలుకి మహిళకి సిండ్రోమ్ ఎలా సోకింది అనే దానిపై వైద్యశాఖ ఆరా తీస్తుంది. GBS వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి. అసలు వైద్య నిపుణులు ఈ వ్యాధి గురించి ఏం చెబుతున్నారు. తెలుసుకోవాలి…ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకొని మరల ప్రశాంతంగా జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి సమయంలో కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.
తలో ఇప్పుడు మరొక వైరస్ కలకలం రేపుతుంది. గులియన్ బారే సిండ్రోమ్, (GBS ) కేసులు పెరగడంతో ఆందోళన కలిగిస్తుంది. తుమ్మిన…దగ్గినా… జ్వరం వచ్చిన సరే GBH ఎటాక్ అయిందా…? హడలిపోయే రోజులో వచ్చిన పరిస్థితి ఈ సమాజం నెలకొంది. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో GBS పాజిటివ్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. తాజాగా మన తెలంగాణలో GBS ఏంజెల్ సిచువేషన్ కొనసాగుతుంది. అయితే శుక్రవారం నాడు హైదరాబాదులో.. GBS కేసు నమోదయింది. సిద్దిపేటకు చెందిన మహిళకు GBS పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారణ చేశారు. ప్రస్తుతం ఆ మహిళకు ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేషన్లో చికిత్స అందిస్తున్నారు.GHS లక్షణాలు ఎలా ఉంటాయి. అసలు నీ పునులు ఏం తెలియజేస్తున్నారు. అనే విషయం తెలుసుకుందాం…
(GBS)గులియన్ బారే సిండ్రోం లక్షణాలు :
ఈ వ్యాధి యొక్క లక్షణాలు కలుషితమైన ఆహారం… బ్యాక్టీరియా లేదా ఇన్ఫెక్షన్ల ద్వారా GBS సోకుతుంది. దీని లక్షణాలు జ్వరం, వాంతులు, ఒళ్లంతా తిమ్మిర్లు, డయేరియా, పొత్తికడుపు నొప్పి, నీరసం, కండరాల బలహీనత లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
ఆరోగ్య నిపుణుల సమస్థ ఏమంటుంది:
ఈ గులియన్ బారే సిండ్రోమ్ ప్రధానంగా కలుషిత ఆహారం వల్ల ఎటాక్ అవుతుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియాల్ కారణంగా మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులకు, ఈ GBS బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే, GBS వ్యాధి గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని,ఇది అంటువ్యాధి కాదని కిడ్స్ తో నయం చేసుకోవచ్చని వైద్యులు పేర్కొన్నారు.
ఒక రెండు వారాల్లోనే :
ఈ GBS వ్యాధి ఇన్ఫెక్షన్లతో మొదలై, ఒక వ్యక్తికి ఒక రెండు వారాల తర్వాత ఇది బయటపడుతుంది. అరుదుగా వాడే ఇన్ ఫ్లూయెంజా, టెటనస్ టీకాల వంటివి కూడా GBS దోహదం చేయవచ్చని అంటున్నారు నిపుణులు. కరోనా లాగా ఇది అంటువ్యాధి కాదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అప్రమత్తంగా ఉండాలి. వైద్యులు చెప్పినట్లుగా వైరస్ లక్షణాలు కనిపిస్తే మాత్రం హాస్పిటల్స్ కి వెళ్లాల్సి ఉంటుంది.
సకాలంలో వైద్యం అందితే:
మహారాష్ట్రలో ఇప్పటికే 130కి పైగా GBS బారిన పడి కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఇద్దరు చనిపోయారు కూడా. ఈ గులియన్ బారే సిండ్రోమ్ సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు. వైద్యం తీసుకోవడం విషయంలో నిర్లక్ష్యం వహించిన… ఆలస్యం జరిగితే అనర్థం తప్పదు అంటున్నారు నిపుణులు. వ్యాధి సోకిన తొలి దశలోని ఆసుపత్రిలోకి చేరితే.. నాలుగు వారాల్లో కోరుకునే ఛాన్స్ ఉందంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే మాత్రం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టవచ్చు అని చెబుతున్నారు. బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల, కారణంగా బలహీన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ GBS మారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు తెలియజేస్తున్నారు.
బయట తినడం మానుకోవాలి:
GBS కేసులు పెరుగుతున్న దృష్ట్యా..ALLMS న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియ సెహ్రవత్ బయట ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవడం మానేయాలి అని సూచించారు. కలుషితమైన ఆహారం మరియు కలుషిత నీటిని వల్ల కలిగే గ్యాస్ట్రో ఎంటేరిటీస్, గ్విలియన్ -బారే సిండ్రోమ్ కు కారణమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సెహ్రవత్ ప్రజలు బయట తినడం మానేయాలి అని. ఆహారం, నీటి భద్రత గురించి జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.