Health Tips : గుడ్ న్యూస్ .. ఉదయాన్నే ఈ రసం తాగి నడిస్తే బరువు తగ్గుతారట.. జ్యూస్ తో ఉబకాయనికి చెక్..!
Health Tips : ఉసిరికాయతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. ఉసిరిలో విటమిన్ -సి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని సరిచేయడం దగ్గర నుంచి జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలకు ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్దకం, మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఉసిరి చేసే మేలు ఏ మందు కూడా చేయలేదని అంటున్నారు. అయితే వీటితో పాటు ఉసిరి కాయను తినడం వల్ల శరీరంలోని […]
Health Tips : ఉసిరికాయతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయన్న విషయం తెలిసిందే. ఉసిరిలో విటమిన్ -సి ఎంతో మేలు చేస్తుంది. వాతావరణ మార్పుల వల్ల కలిగే హర్మోన్‌లోని వ్యత్యాసాన్ని సరిచేయడం దగ్గర నుంచి జలుబు, దగ్గు వంటి ఎన్నో సమస్యలకు ఉసిరికాయ ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్దకం, మధుమేహం వంటి వ్యాధులున్నవారికి ఉసిరి చేసే మేలు ఏ మందు కూడా చేయలేదని అంటున్నారు. అయితే వీటితో పాటు ఉసిరి కాయను తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోయి బరువు తగ్గుతారని తాజాగా వైద్య నిపుణులు అంటున్నారు. అయితే దీనిని సరైన పద్ధతిలో తీసుకుంటే మెరుగైన ఫలితాలు కలుగుతాయట. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధునిక మానవ జీవితంలో వచ్చిన ఎన్నో మార్పుల వల్ల మనలో చాలా మందికి ఉబకాయం అనేది పెద్ద సమస్యగా మారి పోయింది. డైట్ లని, జిమ్ లో ఎక్సర్‌సైజ్ లని గంటల తరబడి శ్రమ పడేవారు అధికంగా ఉన్నారిప్పుడు. అయితే ఎన్ని చేసినా బరువులో ఏమాత్రం తేడా ఉండక వారంతా నిరాశకు గురి అవుతున్నారు. అయితే అలాంటి వారికోసమే ఇప్పుడు వైద్యులు ఓ అద్భుతమైన చిట్కా చెబుతున్నారు. ఎక్కువ శ్రమ అనేదే అవసరం లేకుండా రోజూ ఉదయం పరిగడపున ఉసిరికాయ రసం తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు. ఈ జ్యూస్ శరీరంలోని జీవక్రియను పెంచి కొవ్వు శాతాన్ని కరిగిస్తుందని అంటున్నారు.
Health Tips : ఉసిరి జ్యూస్ తాగి.. కాసేపు నడిస్తే చాలు..
అయితే ఉదయాన్నే ఈ ఉసిరి జ్యూస్ తాగిన తర్వతా వాకింగ్ చేస్తే ఇంకాస్త మెరుగైన ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు మీడియం స్పీడ్ తో నడుస్తూ ఉండాలని సూచిస్తున్నారు. తద్వారా.. స్థూలకాయంతో పాటు గుండె వ్యాధులు, డయాబెటిస్, అధిక రక్త పోటు, డిప్రెషన్.. వంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉంటామని అంటున్నారు.