Watermelon Seeds : పుచ్చ గింజల టీతో ఎన్ని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Watermelon Seeds : పుచ్చ గింజల టీతో ఎన్ని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :23 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Watermelon Seeds : పుచ్చ గింజల టీతో ఎన్ని ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Watermelon Seeds : సహజంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో రకాల పండ్లను తింటూ ఉంటాం.. వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం.. అయితే అందరూ కూడా పుచ్చకాయలను తిని వాటి గింజలను పడేస్తూ ఉంటారు. పుచ్చకాయ గింజలు డ్రై ఫ్రూట్స్ లో ఒకటి అని మనకు తెలుసు. ఈ గింజలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రధానంగా వేసవికాలంలో పుచ్చకాయ గింజలతో టీ తయారు చేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయట మరి అవి ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. నిజానికి పుచ్చకాయలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీనితో దాహాన్ని తీర్చడమే కాదు. శరీరం డిహైడ్రేషన్ గురి అవ్వకుండా ఉంటుంది. శరీరం కూల్ గా ఉంచుతుంది. పుచ్చకాయల లో ఉండే గింజలు నీరు లేదా టీతో ఎన్నో పోషకాలు లభిస్తాయి.

పుచ్చకాయ గింజల నీరు: పుచ్చకాయ గింజలను శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నీటిని నిత్యం తీసుకోవడం వలన శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు అందుతాయి.పుచ్చ గింజల టీ: పుచ్చ గింజలను తీసి వాటిని ఆరబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పుచ్చ గింజల టి తయారీ కోసం ఒక గిన్నెలో లీటర్ నీరు పోసుకోవాలి. దాన్లో కొంచెం పుచ్చకాయ గింజల పొడి వేసి బాగా ఉడికించాలి. దాన్లో కొంచెం నిమ్మకాయ రసం, నెయ్యి వేసి తాగాలి. ఇలా మూడు రోజులు తాగినట్లయితే.. షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి.పుచ్చకాయ గింజల టి వలన కలిగే ఉపయోగాలు.

దృఢమైన జుట్టు కోసం: బలమైన జుట్టుకు పుచ్చకాయ గింజల నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది. జుట్టు డామేజ్, దురద నుంచి ఉపశమనం కలిగిస్తుంది.బీపీ కంట్రోల్ చేయడానికి: పుచ్చకాయ గింజల్లో ఆ మైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను పెంచుతాయి. దీనిలోని క్యాల్షియం ఎముకలను బలోపితం చేస్తాయి. రక్తపోటును కంట్రోల్ చేస్తాయి. రక్తనాళాలను సంకుచితం కాకుండా ఉంచుతాయి.

గుండె ఆరోగ్యానికి మేలు: మీ గుండె ఆరోగ్యంగా ఉండడం కోసం పుచ్చకాయ గింజల నీరు తాగడం చాలా మంచిది. ఈ నీటిని ప్రతి రోజు తాగడం వలన గుండె సమస్య నుంచి బయటపడవచ్చు…
అలాగే ఈ గింజల నీటిని తాగడం వలన అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది