Hand Rubbing : మనసుకు చేతులు రుద్దటానికి అసలు సంబంధం ఏముందని అనుకుంటున్నారా… ఉంది… అదేమిటో తెలుసుకోండి…??
Hand Rubbing : మనలో చాలామంది అప్పుడప్పుడు రెండు చేతులను రుద్దుతూ ఉంటారు. అయితే ఈ రెండు అరచేతులను రుద్దటం అనేది ముద్ర దోషం అని చాలామంది భావిస్తారు. అలాగే ఎంతో మందికి తరచుగా అరచేతులలో చమట అనేది పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే చలికాలంలో ఈ సమస్య అనేది తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి టైంలో కూడా చేతులను మళ్లీ మళ్లీ రుద్దుతూ ఉంటారు. అంతేకాక చాలామంది ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు లేక ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు టేబుల్ కింద పదేపదే చేతులను రుద్దుతూ ఉంటారు. అయితే పరీక్షలు లేక ఇంటర్వ్యూ ఒత్తిడి నుండి బయటపడేందుకు ఇలా చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే భయం మరియు మానసిక ఆందోళన వచ్చినప్పుడు కూడా ఇలా చేయొచ్చు…
ఈ రకంగా మనసుకు సానుకూల శక్తిని ప్రసారం చేసేందుకు ఉద్దీపనగా ఉపయోగపడుతుంది. ఈ ముద్ర అనేది మానసిక స్థితిని మరియు మనస్సు ను శాంత పరచటానికి హెల్ప్ చేస్తుంది. అలాగే రెండు అరచేతులు రుద్దటం వలన కలిగే ప్రయోజనాలు కూడా బోలెడు ఉన్నాయి. అయితే ఈ రెండు చేతుల అరచేతులను రుద్దడం వలన శరీరంలో రక్త ప్రసరణ అనేది ఎంత మెరుగుపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే మీలో ఎప్పుడైనా ఏకాగ్రత అనేది లోపిస్తే లేక అనిచ్చితితో ఇబ్బంది పడుతుంటే ఈ విధానాన్ని మీరు ప్రయత్నించవచ్చు. అలాగే మీరు ఏదైనా విషయం గురించి ఇబ్బంది పడుతూ ఉంటే రెండు అరచేతులను రుద్దడం వలన మీరు దానిని అధిగమించవచ్చు. ఈ ట్రిక్ అనేది శారీరక అలసటను కంట్రోల్లో ఉంచుతుంది.
అలాగే ఆనందం మరియు విచారం, నీరసం వీటిలో ఏదైనా సరే అతిగా ఉండడం కూడా మంచిది కాదు. వీటివలన మనసుపై ఎంతో ఒత్తిడి పెరుగుతుంది… అలాగే మనసు సంచలనంగా ఉన్నా లేక నాడి ఉద్రిక్తత సరిగ్గా లేకపోయినా నిద్ర అనేది అసలు రాదు. కావున మీరు రాత్రి పడుకునే ముందు మీ రెండు అరచేతులను రుద్దడా నికి ప్రయత్నించండి. అలాగే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే రెండు అరచేతులను రుద్దడం వలన శరీర వేచ్చదానాన్ని తాత్కాలికంగా ఎంతగానో పెంచుతుంది. అంతేకాక చేతులు మరియు కాళ్లు చల్లగా ఉండేవారు కూడా ఈ ట్రిక్ ను ప్రయత్నించండి. అయితే ఈ విధానం అనేది ఫింగర్ ఫ్లెక్సిబిలిటీని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది…