Dirty Water : ప్రతి ఒక్కరికి కలలు రావటం సహజం… కానీ వాటి అర్థాలేంటో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :11 October 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Dirty Water : ప్రతి ఒక్కరికి కలలు రావటం సహజం... కానీ వాటి అర్థాలేంటో తెలుసా...!!

Dirty Water : ఈ రోజులలో ప్రతి ఒక్కరు కలలను కచ్చితంగా కంటూ ఉంటారు. అయితే కొంతమందికి మంచి కలలు వస్తే మరి కొందరికి మాత్రం చెడు కలలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కలలు అనేవి మనం రోజు చేసే దినచర్యను బట్టి వస్తాయి అని కొందరు అంటూ ఉంటారు. అలాగే మీకు హఠాత్తుగా కలలో మీరు స్నానాల గదిలో లేక ఏదైనా నదుల ఒడ్డున స్నానం చేస్తున్నట్లుగా వస్తే అది శుభప్రదంగా చెప్పొచ్చు అని జ్యోతిష్యలు అంటున్నారు. అది మీకు ఎంతో శుభ సూచిక కావచ్చు అని అంటున్నారు. అలాగే జలపాతం కావచ్చు మరియు మరి ఇంకెక్కడైనా మంచి నీటితో స్నానం చేస్తున్నట్లు మీకు కల వస్తే అది కూడా నీకు మంచికే అని చెబుతున్నారు. మీకు ఈ కల అనేది రాబోయే రోజుల్లో ఆనందం మరియు సంపాదను ఎంతగానో తెచ్చిపెడుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యం ఎంతో బాగుంటుంది అని దీని యొక్క అర్థం. మీరు ఏదైనా అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అప్పుడు ఈ కల గనక మీకు వస్తే మీరు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్య నుంచి కోలుకుంటారు అని దాని యొక్క అర్థం అంట…

అంతేకాక మీరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీకు ఆ కల గనక వస్తే అప్పుడు రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అని దీని యొక్క అర్థం అని అంటున్నారు. కానీ అలా కాకుండా మీ కలలో మీరు మురికి నీటితో స్నానం చేస్తున్నట్లుగా వస్తే అది చెడు కల అని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే మీ రాబోయే రోజులలో మానసిక కల్లోలం మిమ్మల్ని వేధిస్తుంది అని ఈ కల మిమ్మల్ని హెచ్చరిస్తుందన్నమాట. అందుకే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని ఈ కల చెబుతుంది. అయితే మీకు ఈ కల జాగ్రత్తగా ఆలోచించు మరియు ప్రమాదంతో కూడిన పనులు చేయొద్దు అని మీకు చెబుతుంది…

Dirty Water : ప్రతి ఒక్కరికి కలలు రావటం సహజం... కానీ వాటి అర్థాలేంటో తెలుసా...!!

Dirty Water : ప్రతి ఒక్కరికి కలలు రావటం సహజం… కానీ వాటి అర్థాలేంటో తెలుసా…!!

అలాగే మీకు మీ కలలో పాదాలు కడుగుతున్నట్లుగా కల వస్తే అది మీకు మంచిది అని చెప్పొచ్చు. అయితే మీరు చాలా నెలల పాటు లేక సంవత్సరాలుగా ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలి అనే ఉద్దేశంతో కష్టపడతారు మరియు ప్రయత్నిస్తూ ఉంటే రాబోయే రోజులలో మీరు మీ లక్ష్యాన్ని కచ్చితంగా సాధిస్తారు అని ఈ కల మీకు చెబుతుంది. అయితే మొత్తం మీద ఈ కలలు మంచి నీటితో స్నానం చేస్తే మంచిది అని మురికి నీటితో స్నానం చేస్తే చెడు అని అర్థం అన్నమాట…

Also read

Tags :

ramu

Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి