Skin : పైసా ఖర్చు లేకుండా… మీ అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి…!
ప్రధానాంశాలు:
Skin : పైసా ఖర్చు లేకుండా... మీ అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి...!
Skin : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అందం కోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉంటారు. దీనికోసం ఖరీదైన క్రీములు మరియు బ్యూటీ పార్లర్ ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ ఇంటిలోనే ఈజీగా దొరికే పచ్చిపాలతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే ఈ పచ్చిపాలనేవి మీ స్కిన్ పై టోనర్ గా పని చేస్తాయి. దీనికోసం రాత్రి పడుకునేటప్పుడు మీరు చర్మానికి పచ్చిపాలను అప్లై చేసుకోవాలి. దీని వలన మీ స్కిన్ అనేది బిగుతుగా మారుతుంది. అయితే ఈ పచ్చి పాలలో లాక్టిక్ యాసిడ్ చర్మ లోపల క్లిన్ చేయటంతో పాటుగా మొటిమలు రాకుండా కూడా చేస్తుంది. దీని కోసం మీరు ఒక గిన్నెలో పచ్చి పాలను తీసుకోవాలి. అలాగే దీనిలో కొద్దిగా రోజు వాటర్ ను కూడా కలుపుకోవాలి. తర్వాత దీనిని ముఖానికి అప్లై చేసుకొని వృత్తాకారంలో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఇది డెడ్ స్కిన్ ను క్లీన్ చేస్తుంది. అలాగే మృతకాణాలను తగ్గించి చర్మనికి పునర్జీవనం ఇస్తుంది. అలాగే మీ ముఖం ఎంతో కాంతివంతంగా కూడా మారుతుంది…
మీ ముఖాన్ని క్లీన్ చేసుకోవడానికి పచ్చిపాలను వాడడం వలన మీ ముఖంలో మంచి గ్లో అనేది వస్తుంది. ఇది మీ మొఖంపై పేర్కొన్నటువంటి మురికిని పోగొట్టటమే కాక సహజ తేమను కూడా ఇస్తుంది. ఇది చర్మానికి సహజ పోషణను మరియు తేమను కూడా అందిస్తుంది. అలాగే మలినాల వలన చర్మ రంద్రాలు అనేవి మూసుకుపోకుండా కూడా రక్షిస్తుంది. అలాగే సున్నితమైన మరియు పొడి చర్మం ఉన్న వారిలో కూడా చర్మం అనేది మృదువుగా మారాలి అంటే పచ్చిపాలు మరియు తేనే బెస్ట్ హోమ్ రెమిడీ అని చెప్పొచ్చు. అయితే ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. దీనిని ఒక 15 నిమిషాల తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయటం వలన మీ చర్మం అనేది ఎంతో మృదువుగా మారుతుంది…
అలాగే ఎండ వేడి వలన వచ్చే టాన్ మరియు పీగ్మెంటెషన్ లాంటి సమస్యలను పచ్చిపాలతో కంట్రోల్ చెయ్యొచ్చు. అలాగే పాలతో చర్మ ఛాయను కూడా పెంచవచ్చు. దీనిలో ఎక్కువ మొత్తంలో దొరికే లాక్టిక్ యాసిడ్ చర్మ ఛాయను పెంచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే చర్మం అనేది పొడిబారితే దీనికి కూడా పరిష్కారం పచ్చిపాలే. అయితే ఈ పచ్చి పాలలో రెండు చుక్కల వరకు బాదం నూనె వేసి చర్మానికి అప్లై చేసుకొని 30 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇలా గనక మీరు కొద్ది రోజులపాటు చేస్తే మీ చర్మానికి తగినంత తేమ అనేది అంది చర్మం పొడిబారడం తగ్గుతుంది…