Tea Vs Chai మార్కెట్లో పోటీపడుతున్న టీ Vs చాయ్… అధిక డిమాండ్ దీనికే….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea Vs Chai మార్కెట్లో పోటీపడుతున్న టీ Vs చాయ్… అధిక డిమాండ్ దీనికే….!

Tea Vs Chai : ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దున్నే ఒక కప్పు చాయ్ తాగనిదే రోజు మొదలు కాదు. ఆ విధంగా అందరి జీవితాలలో చాయ్ ఒక భాగం అయిపోయింది. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాలామంది అనేక సందర్భాలలో చాయ్ తాగుతూనే ఉంటారు. మరి కొందరైతే అసలు ఎన్ని కప్పులు తాగుతున్నారు అనేది లెక్క కూడా ఉండదు. అంతలా చాయ్ కి ఎడిట్ అయిపోయారు. మరి అలాంటి చాయ్ ప్రియులకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :18 August 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Tea Vs Chai మార్కెట్లో పోటీపడుతున్న టీ Vs చాయ్... అధిక డిమాండ్ దీనికే....!

Tea Vs Chai : ప్రతి ఒక్కరి జీవితంలో పొద్దున్నే ఒక కప్పు చాయ్ తాగనిదే రోజు మొదలు కాదు. ఆ విధంగా అందరి జీవితాలలో చాయ్ ఒక భాగం అయిపోయింది. పొద్దున్నే నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాలామంది అనేక సందర్భాలలో చాయ్ తాగుతూనే ఉంటారు. మరి కొందరైతే అసలు ఎన్ని కప్పులు తాగుతున్నారు అనేది లెక్క కూడా ఉండదు. అంతలా చాయ్ కి ఎడిట్ అయిపోయారు. మరి అలాంటి చాయ్ ప్రియులకు ఇరానీ చాయ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు. కొన్ని దశాబ్దాల కాలంగా హైదరాబాద్ ముంబై వంటి మహానగరాలలో ఇరానీ చాయ్ రాజ్యమేలుతూ వస్తుంది. కానీ ప్రస్తుతం ఇరానీ చాయ్ వెలవెలబోతుందని కొన్ని సర్వేల ద్వారా వెళ్లడైంది. ఒకప్పుడు ఇరానీ చాయ్ ఉన్న డిమాండ్ ఇప్పుడు ఎందుకు లేదు…?గతంలో లాగా ఈ బిజినెస్ ఇప్పుడు ఎందుకు లాభాలు సంపాదించలేక పోతుంది..?

ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం ఒక్కటే…అదే టీ.. ప్రస్తుతం అన్నిచోట్ల ఈ టీ నెట్వర్క్ బిజినెస్ లో గట్టి పోటీ ఇస్తున్నాయి. దీంతో ఇరానీ చాయ్ కేఫ్ ల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇరానీ చాయ్ Vs టీ అనే గట్టి పోటీ మార్కెట్లో కొనసాగుతుంది… మరి దీనిలో నెగ్గేది ఏది అంటే… ఒకప్పుడు కప్పు సాసర్ లో టీ తాగితే ఆ టేస్ట్ వేరేలా ఉండేది. ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అంటూ చాయ్ ప్రియులు చెప్పుకోచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ కప్పు సాసర్ లతో పాటు ఇరానీ కేఫ్ లు కూడా అంతకంతకు తగ్గిపోతున్నాయి. అయితే వాస్తవానికి ఇరానీ చాయ్ అనేది ఈనాటి కాలానికి చెందింది కాదు. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పేరుకు ఇరాన్ నుంచి వచ్చినప్పటికీ ఇది మాత్రం హైదరాబాద్ మరియు ముంబై మహానగరాల కల్చర్ లో భాగమైపోయింది. ఈ నేపథ్యంలోనే ఎవరైనా ఏదైనా విషయాన్నీ గురించి మాట్లాడాలనుకున్న పదా చాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ అలా బాగా ఫేమస్ అయిపోయింది. ఆ విధంగా హైదరాబాదులో చాలామందికి ఇరానీ చాయ్ తాగటం అనేది అలవాటుగా మారిపోయింది. అయితే ప్రస్తుతం ఇరానీ చాయ్ రేట్లు కూడా విపరీతంగా పెరగాయని చెప్పాలి.

Tea Vs Chai మార్కెట్లో పోటీపడుతున్న టీ Vs చాయ్ అధిక డిమాండ్ దీనికే

Tea Vs Chai మార్కెట్లో పోటీపడుతున్న టీ Vs చాయ్… అధిక డిమాండ్ దీనికే….!

ఒక్కసారిగా ఒక కప్పు పై 5 రూపాయలు రేట్ పెంచేశారు. అయితే పాతికెళ్ల వెనక్కి వెళ్లి ఇరానీ చాయ్ రేట్ చూస్తే 1997లో దీని ధర కేవలం రెండున్నర రూపాయలు మాత్రమే. అనంతరం 2000 సంవత్సరంలో దీని రేటు ₹5 రూపాయలకు పెరిగిపోయింది. మరో 5 ఏళ్లు గడిపిన తర్వాత ఇరానీ చాయ్ ధర ఏడున్నర రూపాయలకు చేరింది. అలా 2014లో 15 రూపాయలు 2020లో 20 రూపాయలకు చేరింది. ఇక ఇప్పుడు మరో ఐదు రూపాయలు పెంచి అమ్ముతున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో ఒక కప్పు ఇరానీ చాయ్ ధర 25 రూపాయలు అయింది. ధరలు విపరీతంగా పెరగడంతో చాలామంది 5 – 10 రూపాయలకే లభిస్తున్న టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మరికొందరు ఎంత రేటు పెరిగినప్పటికీ ఇరానీ చాయ్ నే ఇష్టంగా తాగుతున్నారు.కానీ మార్కెట్ పరంగా చూస్తే చూస్తే మాత్రం టీ మరియు చాయ్ రెండిటికి బాగా డిమాండ్ ఉంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది