Us Red Day : అమెరికా రెడ్ డై-3 సింథటిక్ రంగును ఎందుకు నిషేధించింది… కారణం..?

Authored By aruna | The Telugu News | Updated on: January 26, 2025, 12:46 pm
  •  Us Red Day : అమెరికా రెడ్ డై-3 సింథటిక్ రంగును ఎందుకు నిషేధించింది...కారణం..?

Us Red Day : అమెరికాలో రెడ్ డై 3 అనే సింథటిక్ రంగును నిషేధించడం జరిగింది. దీనికి గల కారణం, ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇతర పానీయాలు, మందులలో వాడుతారు. అయితే ఈ రంగును మొదట ఎలుకలపై ప్రయోగాలు జరిపినారు. ఫలితంగా క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నాయని తేలింది. అయితే వినియోగదారులు ఆరోగ్యం పై దృష్ట్యా అనుసారంగా.. FDA అను రంగును ఆహార,ఔషధ ఉత్పత్తుల్లో నిలిపివేయాలని నిర్ణయించింది. మనం ఎక్కువగా ఆహార పదార్థాలు మరియు తాగే డ్రింక్స్ లు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడే సింథటిక్ కలర్ రెడ్ డై 3 పై అమెరికా నిషేధం విధించింది. రెడ్ డైత్రి అనేది ఆహార పదార్థాలకు చెర్రీ పండ్ల వంటి ఆకర్షణీయమైన ఎరుపు రంగు ఉంటుంది. దీన్నే రెడ్ నంబర్ 3 అని కూడా పిలుస్తారు. అమెరికా వాళ్ళు ఎందుకు దీన్ని నిషేధించారు ఇప్పుడు తెలుసుకుందాం…..

Us Red Day : అమెరికా రెడ్ డై-3 సింథటిక్ రంగును ఎందుకు నిషేధించింది...కారణం..?

Us Red Day : అమెరికా రెడ్ డై-3 సింథటిక్ రంగును ఎందుకు నిషేధించింది…కారణం..?

Us Red Day ఆహారాలు మందులలో వినియోగం

రెడ్ డై 3 ని ముఖ్యంగా, కుకీలు, కేకులు, స్వీట్స్, మిఠాయిలు, ప్రజెంట్ డెసర్ట్స్, ప్రాస్టింగులలో వాడతారు. ఇంకా దగ్గు సిరప్ లు, విటమిన్ గంమ్మీలు వంటి మందులలోను దీన్ని ఉపయోగిస్తారు. 2027 జనవరి నాటికి ఆహార ఉత్పత్తులు, 2028 నాటికి ఔషధ తయారీదారులు ఈ రంగును ఉపయోగించడం నిలిపివేయాలి అని FDA స్పష్టం చేసింది…

Us Red Day క్యాన్సర్ కారక లక్షణాలు

ప్రయోగశాలలో మగ ఎలుకపై చేసిన ప్రయోగం, ఈ రంగు క్యాన్సర్ కారక లక్షణాలను చూపించినట్లు పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ అధ్యయన ఫలితం ఆధారంగానే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) రెడ్ డై 3 నిషేధించింది. అయితే ఈ పరిశోధనలు ఉపయోగించిన రంగు పరిమాణం సాధారణంగా ఆహారంలో వాడే పరిమాణాన్ని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అమెరికా చట్టం ప్రకారం క్యాన్సర్ సంబంధిత అనుమానం ఉన్న పదార్థాలపై నిషేధాన్ని తప్పనిసరి అని విధించింది.

కాస్మెటిక్ రంగులలో నిషేధం :

రెడ్ డై 3 వినియోగాన్ని అమెరికన్సు ఇప్పటికే 38 ఏళ్ల క్రితం కాస్మెటిక్ ఉత్పత్తులు నిషేధించారు. అయితే అదే రంగుని పిల్లల్ని కూడా తినే ఆహారంలో అనుమతించడం వల్ల ఇంకా ఈ రంగు పై విమర్శలు వచ్చాయి. వినియోగదారుల కోసం మేలు చేసే ఈ సింథటిక్ రంగు సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లాంటి సమస్యలు దీన్ని నిషేధించడానికి పిటిషన్ వేశారు.

వినియోగదారులకు ఆరోగ్యం పై ప్రభావం: వినియోగదారులు రెడ్ డై 3 కు బదులుగా కొందరు తయారీదారులు ఇప్పుడు రెడ్ డై 40ని ఉపయోగిస్తున్నారు. ఇది కొంత ఆరోగ్యం పైన ప్రత్యామ్ న్యాయం పరిగణించినప్పటికీ.. ఎలుకలపై నిర్వహించిన కొన్ని ప్రయోగాల్లో జీర్ణ సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది అని తెలిసింది. ఏ సమయంలో బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ కి రెడ్ డై 40 కారణం కావచ్చని తెలిపింది.

విదేశీ నిషేధాలు :

కాలిఫోర్నియా ఇప్పటికే 2023లో ఆహార పదార్థాలలో రెండు డై 3 వాడకాన్ని నిషేధించింది. అలాగే ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, యూరోపియన్, యూనియన్ వంటి దేశాలు ఈ రంగు పై ఆంక్షలు విధించాయి. అమెరికా నిషేధం నెమ్మదిగా అమలవుతున్నప్పటికీ ఇది వినియోగదారులకు ఆరోగ్యానికి పునాది వేయగలదు.

తయారీదారుల స్పందన:

NCA ( నేషనల్ కన్ఫెక్షన్ర్స్ అసోసియేషన్) ఈ నిషేధాన్ని స్వాగతించింది. మిఠాయి కంపెనీల వినియోగదారులు భద్రత తొలిప్రే ధాన్యమని NCA వెల్లడించింది. ఈ నిషేధం కారణంగా తయారీదారులు ఇప్పటికే ప్రత్యామ్నాయాలను అన్వేషించసాగారు. అయితే రెడ్ డై 3 పై తీసుకున్న ఈ నిర్ణయం, వినియోగదారుల ఆరోగ్యం కోసం కీలకమైనదిగా భావించారు. దీని ఫలితంగా ఆహార రంగుల్లో మరింత సురక్షితమైన మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కావున కలర్ఫుల్ పానీయాలను మరియు రంగురంగుల ఆహార పదార్థాలను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాల్సి ఉంటుంది. లేకపోతే అసలు తీసుకోకపోతేనే ఇంకా మంచిది.

aruna

No bio available for this author.

  1. "AP Municipal Election Results : ఏపీలో కూటమి ప్రభంజనం.. పులివెందులలోనూ వైసీపీకి షాక్!"

  2. "Superstar Krishna Remuneration : సూపర్ స్టార్ కృష్ణ తొలి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? విజయనిర్మల చెప్పిన ఆసక్తికర విషయాలు!"

  3. "US Midterm Elections 2026 : అమెరికా ఎన్నికలతో భారత్‌కు కొత్త పరీక్ష.. ట్రంప్ ఓడితే మనకు లాభమా? నష్టమా?"

  4. "Chandrababu : డిసెంబరులో ఏపీ కేబినెట్‌లో మార్పులు? పల్నాడు, రాయలసీమ కు కొత్త మంత్రులు!"

  5. "Home Loan Tips : బ్యాంకులు చెప్పని సీక్రెట్‌.. 20 ఏళ్ల హోమ్ లోన్‌ను త్వరగా తీర్చాలా? ఈ 5 స్మార్ట్ EMI పద్ధతులు పాటించండి..!"

  6. "AP Municipal Election Results : ఏపీ మున్సిపల్ ఫలితాలకు అంతా రెడీ.. ఉదయం 8 గంటల నుంచే లెక్కింపు..!"

  7. "Rising Stars Asia Cup 2026 : నవంబర్ 22న మ‌రోసారి భారత్-పాక్ బిగ్ ఫైట్.. తిలక్ వర్మకు కెప్టెన్సీ!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp