Us Red Day : అమెరికాలో రెడ్ డై 3 అనే సింథటిక్ రంగును నిషేధించడం జరిగింది. దీనికి గల కారణం, ముఖ్యంగా ఆహార పదార్థాలు, ఇతర పానీయాలు, మందులలో వాడుతారు. అయితే ఈ రంగును మొదట ఎలుకలపై ప్రయోగాలు జరిపినారు. ఫలితంగా క్యాన్సర్ కారక లక్షణాలు ఉన్నాయని తేలింది. అయితే వినియోగదారులు ఆరోగ్యం పై దృష్ట్యా అనుసారంగా.. FDA అను రంగును ఆహార,ఔషధ ఉత్పత్తుల్లో నిలిపివేయాలని నిర్ణయించింది. మనం ఎక్కువగా ఆహార పదార్థాలు మరియు తాగే డ్రింక్స్ లు ఆకర్షణీయంగా కనిపించేందుకు వాడే సింథటిక్ కలర్ రెడ్ డై 3 పై అమెరికా నిషేధం విధించింది. రెడ్ డైత్రి అనేది ఆహార పదార్థాలకు చెర్రీ పండ్ల వంటి ఆకర్షణీయమైన ఎరుపు రంగు ఉంటుంది. దీన్నే రెడ్ నంబర్ 3 అని కూడా పిలుస్తారు. అమెరికా వాళ్ళు ఎందుకు దీన్ని నిషేధించారు ఇప్పుడు తెలుసుకుందాం…..
రెడ్ డై 3 ని ముఖ్యంగా, కుకీలు, కేకులు, స్వీట్స్, మిఠాయిలు, ప్రజెంట్ డెసర్ట్స్, ప్రాస్టింగులలో వాడతారు. ఇంకా దగ్గు సిరప్ లు, విటమిన్ గంమ్మీలు వంటి మందులలోను దీన్ని ఉపయోగిస్తారు. 2027 జనవరి నాటికి ఆహార ఉత్పత్తులు, 2028 నాటికి ఔషధ తయారీదారులు ఈ రంగును ఉపయోగించడం నిలిపివేయాలి అని FDA స్పష్టం చేసింది…
ప్రయోగశాలలో మగ ఎలుకపై చేసిన ప్రయోగం, ఈ రంగు క్యాన్సర్ కారక లక్షణాలను చూపించినట్లు పరిశోధనలో స్పష్టం చేశారు. ఈ అధ్యయన ఫలితం ఆధారంగానే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) రెడ్ డై 3 నిషేధించింది. అయితే ఈ పరిశోధనలు ఉపయోగించిన రంగు పరిమాణం సాధారణంగా ఆహారంలో వాడే పరిమాణాన్ని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అమెరికా చట్టం ప్రకారం క్యాన్సర్ సంబంధిత అనుమానం ఉన్న పదార్థాలపై నిషేధాన్ని తప్పనిసరి అని విధించింది.
రెడ్ డై 3 వినియోగాన్ని అమెరికన్సు ఇప్పటికే 38 ఏళ్ల క్రితం కాస్మెటిక్ ఉత్పత్తులు నిషేధించారు. అయితే అదే రంగుని పిల్లల్ని కూడా తినే ఆహారంలో అనుమతించడం వల్ల ఇంకా ఈ రంగు పై విమర్శలు వచ్చాయి. వినియోగదారుల కోసం మేలు చేసే ఈ సింథటిక్ రంగు సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్ లాంటి సమస్యలు దీన్ని నిషేధించడానికి పిటిషన్ వేశారు.
వినియోగదారులకు ఆరోగ్యం పై ప్రభావం: వినియోగదారులు రెడ్ డై 3 కు బదులుగా కొందరు తయారీదారులు ఇప్పుడు రెడ్ డై 40ని ఉపయోగిస్తున్నారు. ఇది కొంత ఆరోగ్యం పైన ప్రత్యామ్ న్యాయం పరిగణించినప్పటికీ.. ఎలుకలపై నిర్వహించిన కొన్ని ప్రయోగాల్లో జీర్ణ సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది అని తెలిసింది. ఏ సమయంలో బ్రిటన్ ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ కి రెడ్ డై 40 కారణం కావచ్చని తెలిపింది.
కాలిఫోర్నియా ఇప్పటికే 2023లో ఆహార పదార్థాలలో రెండు డై 3 వాడకాన్ని నిషేధించింది. అలాగే ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, యూరోపియన్, యూనియన్ వంటి దేశాలు ఈ రంగు పై ఆంక్షలు విధించాయి. అమెరికా నిషేధం నెమ్మదిగా అమలవుతున్నప్పటికీ ఇది వినియోగదారులకు ఆరోగ్యానికి పునాది వేయగలదు.
NCA ( నేషనల్ కన్ఫెక్షన్ర్స్ అసోసియేషన్) ఈ నిషేధాన్ని స్వాగతించింది. మిఠాయి కంపెనీల వినియోగదారులు భద్రత తొలిప్రే ధాన్యమని NCA వెల్లడించింది. ఈ నిషేధం కారణంగా తయారీదారులు ఇప్పటికే ప్రత్యామ్నాయాలను అన్వేషించసాగారు. అయితే రెడ్ డై 3 పై తీసుకున్న ఈ నిర్ణయం, వినియోగదారుల ఆరోగ్యం కోసం కీలకమైనదిగా భావించారు. దీని ఫలితంగా ఆహార రంగుల్లో మరింత సురక్షితమైన మార్గాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కావున కలర్ఫుల్ పానీయాలను మరియు రంగురంగుల ఆహార పదార్థాలను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని తినాల్సి ఉంటుంది. లేకపోతే అసలు తీసుకోకపోతేనే ఇంకా మంచిది.
Cocont Oil Benefits : మనం ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతూనే ఉంటాం. వాటి రుచి మనకు తెలుసు. వాటి…
Ashtalakshmi yoga : ఫిబ్రవరి మాసంలో రాశులు అష్టలక్ష్మి యోగంతో మిధున రాశిలోకి ఈ రాశుల వారు అపర కుబేర్లు కాబోతున్నారు.…
kiwi Fruit : ఈ పండు తినటానికి చాలా రుచిగా, పుల్లగా ఉంటుంది. ఈ పండు పేరు కివి ఫ్రూట్.…
SCR Jobs : సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) 2024-25 సెషన్ కోసం అప్రెంటిస్ చట్టం, 1961 కింద 4232…
Rasi Phalalu : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క సంచారంకు ప్రాముఖ్యత అయితే ఉందో, గ్రహాల యొక్క వక్రగతికి కూడా…
Peerzadiguda : పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని 76th Republic Day ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
Telangana : ఘటకేసర్ మండలం గణపురం గ్రామంలో రైతు భరోసా rythu bharosa , ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు,ఇందిరమ్మ…
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈమధ్య వరుస సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా…
This website uses cookies.