Health Tips : ప్రస్తుతం మన జీవించే విధానంలో ఎన్నో మార్పుల వలన చాలామంది ఊబకాయం సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్యకి ఉల్లిపాయతో చెక్ పెట్టవచ్చు.. ఉల్లిపాయలు ఎన్నో గొప్ప ఔషధ గుణాలు ఉంటాయి. ఇది ఎన్నో వ్యాధుల్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కావున ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని సామెత కూడా ఉంది. అయితే ఉల్లిపాయ రసంలో ఉండే గుణాలు బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఉల్లిపాయ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఎన్నో విటమిన్లు ఉంటాయి. దీనిలో ఉండే ప్లేవనాయుడుస్ శరీరంలో కొవ్వు పేరుకు పోకుండా అధిక బరువును తగ్గిస్తుంది.

ఉల్లిపాయలు తీసుకోవడం వలన స్థూలకాయం తగ్గిపోతుంది. బరువు తగ్గడానికి ఉల్లిపాయను ఎన్నో రకాలుగా తినవచ్చు. అయితే ఈ ఊబకాయం తగ్గించడానికి ఉల్లిపాయను ఏ విధంగా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం… ఉల్లిపాయ సలాడ్ : కొంతమంది సలాడ్ లో ఉల్లిపాయలు వాడుతూ ఉంటారు .నిత్యం ఉల్లిపాయలు తింటే బరువు ఈజీగా తగ్గవచ్చు. అయితే పచ్చి ఉల్లిపాయ తీసుకోవడం వలన బరువు తొందరగా తగ్గుతారు. మీరు నిత్యం మీ ఆహారంతో పాటు ఒక ఉల్లిపాయని సలాడ్ గా తీసుకుంటే ఎంతో సులభంగా బరువు తగ్గుతారు. ఉల్లిపాయ జ్యూస్ ; ఉల్లిపాయ జ్యూస్ బరువు తగ్గించడానికి ఎంతో ప్రభావంతంగా ఉపయోగపడుతుంది.

మీరు బరువు తగ్గడానికి మిగతా జ్యూసులు మాదిరిగానే ఉల్లిపాయ రసాన్ని కూడా ఈ విధంగా తీసుకోవచ్చు. ఉల్లిపాయను మిక్సీలో గ్రైండ్ చేసి రసం చేసి దానిలో నిమ్మరసం ఉప్పు కలిపి తీసుకోవాలి. ఈ విధంగా నిత్యం ఉల్లిపాయ రసం తీసుకుంటే కొవ్వు ఎంతో తొందరగా కరిగిపోతుంది. ఉల్లిపాయ సూప్ : బరువు తగ్గడానికి మీరు ఉల్లిపాయ సూపు తయారు చేసుకొని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి ఆపై నీటిలో వేసి ఉడకబెట్టాలి. వాటిని బాగా మరిగిన తర్వాత కావాలనుకుంటే సూపులో కొన్ని కూరగాయలు కూడా వేసుకోవచ్చు. సూప్ ని బాగా మరగబెట్టి దానికి నల్ల ఉప్పు వేసి తీసుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది..