Beauty Tips : నల్లగా ఉన్న మీ పెదాలు గులాబీ రంగులోకి మారాలనుకుంటే ఈ చిట్కా మీరు తప్పక వాడాల్సిందే.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Beauty Tips : నల్లగా ఉన్న మీ పెదాలు గులాబీ రంగులోకి మారాలనుకుంటే ఈ చిట్కా మీరు తప్పక వాడాల్సిందే..

Beauty Tips : ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అందంగా కనిపించాలి అంటూ చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందంగా కనిపించడం కోసం ఫేషియల్, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ పూర్వం ఇలాంటి బ్యూటీ పార్లర్ చేసేవి కూడా ఉండేవి కాదు అప్పటి వారు వంటింట్లో దొరికే వాటితోనే ఫేషియల్స్ వంటివి చేసుకునేవారు. ముఖం అందంగా కనిపించాలి అంటూ చాలా ఫేస్ క్రీమ్ చేసుకుంటారు అలా రాసుకోవడం వల్ల […]

 Authored By mallesh | The Telugu News | Updated on :24 February 2022,7:40 am

Beauty Tips : ప్రస్తుత కాలంలో మహిళలు, పురుషులు అందం మీద ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. అందంగా కనిపించాలి అంటూ చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందంగా కనిపించడం కోసం ఫేషియల్, బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ పూర్వం ఇలాంటి బ్యూటీ పార్లర్ చేసేవి కూడా ఉండేవి కాదు అప్పటి వారు వంటింట్లో దొరికే వాటితోనే ఫేషియల్స్ వంటివి చేసుకునేవారు. ముఖం అందంగా కనిపించాలి అంటూ చాలా ఫేస్ క్రీమ్ చేసుకుంటారు అలా రాసుకోవడం వల్ల మన ముఖంలో సున్నితమైన పెదవులకు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి అయితే పెదవులు నలుపురంగులో కనిపిస్తూ ఉంటాయి ఈ నలుపు రంగు తగ్గించుకొని పెదవులను మంచి గులాబీ వర్ణంలోకి తీసుకురావడానికి

ఈ చిట్కాను తప్పకుండా పాటించాల్సిందే.ముఖ్యంగా పెదవులు శీతాకాలంలో పగుళ్లు రావడం పొడిబారడం సమస్యలు ఎదురవుతాయి అందుకే నల్లగా మారిన పెదవుల కోసం ఈ చిట్కా పెదవులు గులాబీ వర్ణంలోకి మారడానికి ఒక స్పూన్ పంచదారలో ఆలివ్ ఆయిల్ ను తీసుకోవాలి ఒకవేళ ఆలివ్ ఆయిల్ అందుబాటులో లేకపోతే కొబ్బరి ఆయిల్ లేదా బాదం ఆయిల్ ను తీసుకోవచ్చు. ఒక స్పూన్ తేనె కూడా వేసుకోవాలి. ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తరువాత దీన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు. ఇది దాదాపు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది.తరువాత ఇంకొక చిట్కా కోసం దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి ఆయిల్ ను తీసుకొని, ఇందులోకి వ్యాస్లీన్ పెట్రోలియం జెల్లీ వేసుకొని ఈ మూడింటిని కలుపుకోవాలి.

your black lips to turn pink you must use this tip

your black lips to turn pink you must use this tip

Beauty Tips : ఇప్పుడు నల్లని పెదవులను గులాబీ వర్ణం లోకి మార్చే ఈ చిట్కా గురించి తెలుసుకుందాం..

ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఈ మూడు పదార్థాలని కలిపిన చిన్న గిన్నెను నీటి మధ్యలో పెట్టి డబుల్ బాయిలింగ్ పద్ధతి లో వేడి చేసుకోవాలి. దీన్ని చల్లార్చిన తరువాత ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఇలా తయారుచేసిన వీటితో ప్రతిరోజు ముందుగా మనం తయారుచేసుకున్న స్క్రాబ్ తో పెదాలను ఒక నిమిషం పాటు స్క్రాబ్ చేసుకోవాలి. తరువాత పెదవులను శుభ్రం చేసి మనం చేసుకున్న ఈ పేస్ట్ ను పెదవులకు అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల పెదవుల మీద ఉన్న మృతకణాలు తగ్గిపోయి గులాబీ వర్ణంలోకి పెదవులు మారుతాయి. ఇందులో మనం ఎలాంటి కలర్ ఉపయోగించడం లేదు కాబట్టి ఎలాంటి హాని కలగదు. దీనిని పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది