Aries Horoscope : గురు గ్రహ మార్పు వలన మేష రాశి వారు ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Aries Horoscope : గురు గ్రహ మార్పు వలన మేష రాశి వారు ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 April 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Aries Horoscope : గురు గ్రహ మార్పు వలన మేష రాశి వారు ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి..!

Aries horoscope : గురు బల స్థానం మార్పు చలన ప్రభావం వలన మేష రాశి వారికి ఎలా ఉంటుంది? గురుగ్రహం మేషరాశిని వదిలి వృషభరాశిలో 2024 మే 1 నుంచి 2025 మే 13 వరకు అంటే దాదాపు ఒక సంవత్సరం పాటు గురుగ్రహం వృషభరాశిలో స్థితి పొందుతారు. మేష రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. గురుగ్రహ ప్రభావం వల్ల ఎటువంటి పరిస్థితులు వీరికి ఉంటాయి. అదే విధంగా మేష రాశి వారికి ఏ వ్యాపార సంస్థలు ఉన్నవారికి కలిసొస్తుంది. మీరు చేయవలసిన దేవతారాధన.. పరిహారాలు ఏమిటి అనే విషయాలు పూర్తి తెలుసుకుందాం.. మేషరాశికి అధిపతి కుజుడు. ఇక గురు గ్రహం అంటే సహజ శుభగ్రహం. గురుగ్రహం అనేది కుటుంబ సంతోషానికి సంతానానికి సంతాన అభివృద్ధికి అదే విధంగా సుఖసంతోషానికి ఆదాయానికి ఆధ్యాత్మికతకు వీటన్నిటికీ సూచికగా ఉంటుంది.

గురు గ్రహం అత్యంత శుభగ్రహం అటువంటి గురు గ్రహం ఎప్పుడైతే ఒక రాశులు అడుగుపెడతారో అప్పుడూ పుష్కరాలు ప్రారంభమవుతాయి. 2024 మే 1న గురుగ్రహం స్థితి పొందడం వలన నర్మదా నదికి పుష్కరాలు ఆరంభమవుతాయి. ఈ గురుగ్రహం వృషభరాశిలో స్థితి పొందుట వలన మేష రాశి వారికి అసలు ఎలా ఉంటుంది. వీరికి కలిగే శుభా శుబ ఫలితాలు చూద్దాం.. మేష రాశికి 9 మరియు 12వ స్థానాధిపతి గురుడు అవుతాడు. ఆయన ద్వితీయ స్థానంలో స్థితి పొందుతున్నాడు. 12వ స్థానం అంటే దానం కుటుంబం అదేవిధంగా వ్యాపార అభ్యర్థి ఆధ్యాత్మికతలు బంధుమిత్రులు ఆనందం కాబట్టి వీరికి ధనం వస్తుంది. ధన రాబడి ఉంటుంది. ఈ విధంగా గతంలో పెట్టుబడిన పెట్టుబడులు కావచ్చు.. మేష రాశి వారికి మీకు తిరుగు ఉండదు. కుటుంబంలో ఈ మాటకు విలువ పెరుగుతుంది. అయితే మేష రాశి వారు ఈ సంవత్సరం మొత్తం మీద రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశిలో గురు మార్పిడి జరుగుతుంది.

Aries Horoscope గురు గ్రహ మార్పు వలన మేష రాశి వారు ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి

Aries Horoscope : గురు గ్రహ మార్పు వలన మేష రాశి వారు ఈ 3 విషయాలలో జాగ్రత్తగా ఉండాలి..!

2024 సంవత్సరం మే 3 నుంచి జూన్ 3 వరకు సంవత్సరం మే 3 నుంచి జూన్ 3 వరకు సమయం ఉంటుంది. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి రవి గ్రహం దగ్గరికి ఏదైనా శుభగ్రహం వచ్చినప్పుడు ఆ వేడికి ఇతర గ్రహాలు తన శక్తిని కోల్పోతాయి. కానీ శుభత్వాన్ని కోల్పోతాయి. కాబట్టి ఆ సమయంలో మంచి చేసే గ్రహాలు కూడా ఆసక్తిని ఇవ్వలేమని చెప్పొచ్చు. రవి అంటే వేడి వేడికి దగ్గరగా వచ్చే గ్రహాలు శక్తిని కోల్పోతాయి. దీని వలన శుభకార్యాలు చేయలేక పోతారు. దీంతో గురు గ్రహం కూడా గురుగ్రహం దాని యొక్క బలాన్ని శక్తిని కూడా తగ్గుతూ కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక గురు వక్రీకరణ ఉంటుంది. అది ఇప్పుడు 24 అక్టోబర్ 9 నుండి ఫిబ్రవరి 2025 మధ్య దాదాపు నాలుగు ఐదు నెలలు వక్రీకరణ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువగా కష్టపడాలి. అప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చు.

ఇక ఈ సంవత్సరం మేష రాశి వారికి ఎవరెవరికి బాగుంటుందంటే… హోటల్స్ రెస్టారెంట్స్ ఇటువంటి వ్యాపారాలు ఉన్నవారికి అంతేకాదు.. ఫ్యాషన్, బ్యూటీ ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది. స్వీట్స్, పంచదార బెల్లం ఇటువంటి వ్యాపారాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు పాటించవలసిన పరిహారాలు.. గురు గ్రహం స్తోత్రం చేయాలి. అంతేకాదు జపం , హోమం ఇటువంటివి చేసుకోవాలి. దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన అదేవిధంగా శివారాధన చేయటం శుభప్రదం. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నప్పుడు గానీ ముఖ్యమైన పని ప్రారంభిస్తున్నప్పుడు గానీ తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చేస్తే ఫలితాలు ఉంటాయి..

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది