Kumbh Rashi : జూన్ నెలలో కుంభరాశి వారికి ఎలా ఉందంటే… ఆ ఇబ్బందులు తప్పవు జాగ్రత్త…!
Kumbh Rashi : రాశి చక్రంలో కుంభ రాశి 11వ రాశి. ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. అయితే ఈ రాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉండబోతుంది. జరగబోయే ముఖ్య సంఘటనలు ఏమిటి..? లాభనష్ట ఫలితాలు ఎలా ఉన్నాయి. ఎలాంటి పరహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కుంభ రాశి వారికి జూన్ నెల అనుకూలంగా ఉంటుంది .ఉద్యోగపరంగా కొన్ని అనుకూల మార్పులు జరగడానికి అవకాశం ఉంది. గృహ వాహనాలను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించవచ్చు. కుటుంబ పరంగా మనశ్శాంతి తగ్గే సూచనలు ఉన్నాయి. బంధువులు లేదా సన్నిహితులు లేదా సహచరులు ఈ రాశి వారి మీద అదనపు భారం వేసే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఈ రాశి వారు మొదటి వారం లో అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది.మనసు ఉల్లాసంగా ఉంటుంది. సోదరులతో గొడవలు రాకుండా చూసుకోవాలి. అనుకున్న పనులలో ఆటంకాలు ఎదురవుతాయి.ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. కొత్త పరిచయాలకు దూరంగా ఉండాలి. అయితే ఈ రాశి వారికి జూన్ నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు ఎదురవుతాయి. ఉద్యోగులు వారి ఆఫీసులో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. మరోవైపు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి.మీ వ్యాపారం అభివృద్ధి చెందడానికి తగిన ఆలోచనలు చేస్తారు.
మీ భాగ్య స్వామితో ఉన్న ప్రేమ ఏదో ఒక విషయంలో అపార్థాలకు దారి తీస్తుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఒకటి రెండు ఆర్థిక పరిస్థితులను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో కొన్ని ప్రత్యేక బాధ్యతలను అప్పగిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉండి శుభవార్తలు వింటారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ విషయాలు సానుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు ఏ అడ్డు లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు.ధన లాభం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు.ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఈ నెలలో మీరు కొత్త పనులను ప్రారంభించవచ్చు.అదృష్టం అనేది వీరికి వరిస్తుంది. బిజినెస్ పార్టనర్ షిప్ లో లాభాలను పొందుతారు. జాతకులు ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. దీంతో పాటు నూతన ప్రాజెక్టులలో విజయం సాధిస్తారు. అధికారులను మెప్పించడానికి కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అదిగమిస్తారు.
Kumbh Rashi పరిహారాలు…
కుంభ రాశి వారు నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేయడం శుభప్రదం. దీని తర్వాత విష్ణు ని పూజించి నల్ల నువ్వులను దానం చేయండి. అనుకూలమైన శుభ ఫలితాల కోసం అమావాస్య తర్వాత గోమాత తో ఉన్న ఐశ్వర్య అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించండి. పశుపక్షాలకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయండి.దీని ద్వారా శుభం కలుగుతుంది.